సమాజంలో చెడుకు ఆస్కారం ఇవ్వడానికి కారణం కొంత వరకు నాకు రక్షణ ఉంటె చాలు అనుకునే స్వభావం

ప్రతీ ఒక్కరు పురుషాధిక్య సమాజం వలనే ఈ అత్యాచారాలు అని అరిచే వారు కానీ నిజాలు పట్టించుకోరు!
స్త్రీ పురుషులు ఇద్దరూ ఉద్యోగం చెయ్యాలి అని అనే వాళ్ళు కానీ దాని వల్ల నష్టాలు పట్టించు కోరు, ఇంకొకరు పిల్లలను అతిగా భయ పెట్టకూడదు అని కథలు కథలు వ్రాస్తారు కానీ చెడు మార్గాలకు మళ్ళుతున్న వాళ్ళు వాళ్లకు కానరారు.
ఒక కథ పురుషాధిక్య సమాజం వల్లే ఈ నష్టాలు అని వ్రాస్తారు కానీ అదే కథలో ఆడవాళ్ళ బట్టలు ఎలా కట్టుకుంటే మీకేంటి అంటారు, నిజానికి ఆ బట్టలు ఎందుకు అలా కట్టుకున్నారు అని వ్రాయరు, ఇంకా చెప్పాలి అంటే ఆ బట్టలు తయారు చేసింది ఒక మదం ఎక్కిన పురుషుడు అన్న విషయం కూడా మరచిపోతారు.
ఆ బట్టలు అలా ఎందుకు తయారు చేసారు అనే విషయం వ్రాయరు.
ఇక తరువాత ప్రశ్న పురుషులకు మదం ఎక్కడానికి కారణం ఆడవాళ్ళు ఏమీ చెయ్యలేరు చేసినా పురుషుడు చేసింది తప్పు అని ఎవరూ అనరు అని వ్రాస్తారు! - కానీ నిజం ఆ రకంగా ఉండేది కొంత మందే, నేను కోకొల్లలుగా చూపిస్తాను ఆలా సమాజం నుంచీ వెలి వేయబడ్డ పురుషులను!
పురుష అహంకార సమాజం అని అంటారు కానీ మహిళల చేత చీత్కారాలకు గురయ్యి చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన వారి గురించి చెప్పరే ?