సర్వేలు అనే అబద్దాలు

ఇక అవి చేస్తున్న వారు
1. NDTV - అది CPI ముసుగులో సంస్థ CPI ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ఆ సంస్థ నగ్గుతుంది అని చెబుతుంది
2. CNN - IBN - ఇది కొంచం అటు ఇటుగా అదే సంస్థ

ఇక సర్వేలు ఎవరిమీద జరుగుతాయి అంటే ఆ సంస్థల వల్ల లాభాలు పొందిన వారి దగ్గర ఇక అదే నిజం అనుకుని ఇంకొకడుకు నేను వేసినా వేరేసేది ఏమీ ఉండదు అని జనాలు నమ్మేసి పాప కూపంలో పడిపోతున్నారు మిగిలిన జనాలు.

నిజ నిజాలు జనాలకు తెలిసినా ఈ సర్వేలను నమ్మి మోస పోతున్నారు.
ఇక నాయకుడిని చూసి వెయ్యాలో లేక నియోజక వర్గం లో ఉన్న కులాపోడిని చూసి ఎన్నుకోవాలో అర్ధం కాని పరిస్థితి.

నిజానికి ప్రస్తుతం ప్రజలకు వస్తున్న అనేక అనుమానాలు
1. చదవక ముందు కాకరకాయా చదివాకా కీకరకాయ - అంటే చదువుకున్న వాళ్ళు చట్టంలో లోసుగులతో ఎలా లంచం తీసుకోవచ్చు నిరూపిస్తున్నారు కాబట్టి.
2. దండం దశ గుణం భవేత్ - అంటే ఇది ఒకరకంగా మనలోని భయంతో ఆడుకుంటున్న దొంగలను చూసి, ఎక్కడ ఆ నాయకుడు ఓడిపోతే రాష్ట్రంలో హింసా కాండ వస్తుందో అని భయంతో(మీకు అర్ధం అయ్యిందనుకుంట - అప్పుడు ఇందిరా ఇప్పుడు అదే కారణంతో ఇంకో చెత్త సంస్థ ప్రారంభకుడు)
3. వడ్డించే వాడు నావాడు అయితే ఆఖరి పంక్తిలో కూడా అన్నీ అమరుతాయి - ఇది కుల రాజకీయాలకు సమానంగా చూడటం.
4. మేక నాయకత్వం వహిస్తున్న సింహాల గుంపు గొప్పదా? సింహం నాయకత్వం వహిస్తున్న మేకల గుంపు గొప్పదా? - ఇది నాలాంటి వాడు పడుతున్న సందిగ్ధత
5. మన సాంప్రదాయాలే మన పట్టుకొమ్మలు - వాటిని నిలబెడతాను అనే వాడికి వెయ్యాలా?
6. ఎవరి ఋణం మనం ఉంచు కోకూడదు - అందుకే ఇప్పటికీ వడ్డీ కడుతున్నాం నెహ్రు సంస్థకు!
7. ధనం మూలం ఇదం జగత్ - ఇది ఒక దొంగ నగ్గడం కోసం