నా చిట్టి మనసు

ఇది మా నానమ్మకు నాకు చెప్పిన చాలా విషయాల సమాహారం
మొదటిగా అసలు సంక్రాంతి ఎందుకు చేసుకునే వాళ్ళం అని మా నానమ్మ నన్ను అడిగారు, నాకు తెలియదు అన్నాను, అప్పుడు మా నానమ్మ చెప్పారు, ఇదివరకు రోజులలో 6 నెలల పంట అది దొడ్డు బియ్యం వేసే వారు. ఆ పంట చేతికి రావడానికి 6 నెలలు పట్టేది ఆ తరువాత ఆ బియ్యం అమ్మి వచ్చిన డబ్బులతో గ్రామా మునసబు లేదా ఆ పొలం యజమాని అందరికీ కొత్త బట్టలు లేదా కొత్త వస్తువులు కొని ఇచ్చేవాడు, కానీ అప్పుడు పాత సామాన్లు పడెయ్యడం లాంటివి చెయ్యడం చేస్తుంటే ఏమి చెయ్యాలో అర్ధం కాక అందరూ సమావేశం అయ్యి మంచి రోజులు ఏమిటి అని ఆలోచిస్తే సూర్యుడు మకర సంక్రమణం చేసే సమయం మనకు పంట చేతికి వచ్చే సమయం దగ్గర దగ్గరగా ఉంది కాబట్టి ఆ ముందు రోజు పాత బట్టలు సామాన్లు భోగికి ఆహుతి చేద్దాం తరువాత రోజు అందరికీ కొత్త బట్టలు పంచి పెడదాం అని నిర్ణయించుకుని సంక్రాంతి ఏర్పరిచారు అని చెప్పారు.
మా నానమ్మకు చాలా విషయల మీద అవగాహన ఉంది, ఆవిడ చదువుకోలేదు కానీ విజ్ఞానం అమోఘం, కొన్ని వస్తువుల ఉపయోగాలు కూడా చెప్పే వారు
నెహ్రు ప్రభుత్వం రోజుల్లో మా నానమ్మ తాతయ్య వలలు అల్లే వారంట ఆ వలలు శత్రు సైన్యం నుంచీ మన సైనికులను కాపాడటానికి ఉపయోగించే వారంట, అది ఎలాగా అంటే గోయ్యలు తవ్వి వలలు వాటి మీద కప్పి చెత్త చెదారం  వేసి వల ఉంది అన్న విషయం తెలియకుండా చేసి శత్రు సైన్యం అందులో చిక్కుకునే లా చేసే వారంట.
ఇక మా నానమ్మ గారు తడి అప్పడాలు చెయ్యడంలో నేర్పరి, అవి అమృతం లా ఉండేవి.
మా నానమ్మ గారు అప్పుడప్పుడు పురాణాలు చెప్పే వారు, వాటిని నేటి రోజుకు ఎలా అర్ధం చేసుకోవలో చెప్పే వారు.

మా నానమ్మ గారు అలాగని ఆనందంగా గడిపిన రోజులు ఉన్నాయో లేవో తెలియదు ఎందుకంటే ఆవిడకు కష్టాలే, అప్పట్లో మా నానమ్మ గారికి 9 మంది సంతానం, అమ్మ తన పిల్లల కడుపు నిండాలి అని చూస్తుంది అని అందరూ అంటారు అది మా నానమ్మ గారు విషయంలో నిజం, ఎందుకంటే ఆ రోజుల్లో మా నానమ్మ గారు కరువు వచ్చినప్పుడు పిల్లలకు ఆహారం అందాకా తినే వారు, లేదా పస్తులు ఉండే వారు.
మా ఇంట్లో ఒక ఆవు ఉండేది అది మా తాతయ్య గారు కాలం చేసినప్పుడు దానం ఇచ్చేసారు, కానీ ఆ ఆవుగురించి మా నాన్నమ్మ గారు చెప్పిన విషయాలు
కరువులో కూడా ఆ ఆవు పాలు ఇచ్చేది అవి మా నాన్న గారు పెదనాన్న లు బాబయ్యాలు మేనత్తలు అందరికీ ఆకలి తీరే అంత ఉండేవంట, ఆ ఆవు ఉండటం వలనే మా కుటుంబం లో అందరికీ ఆరోగ్యం ఉందంట!
ఇక ఆ ఆవు దానం ఇచ్చకా వెళ్ళడానికి అసలు అడుగు వెయ్యలేదంట ఆ ఆవుని బలవంతంగా తరలించాల్సి వచ్చిందంట!
కొన్ని సార్లు మా నాన్నమ్మ తినని రోజులు కూడా ఉన్నాయంట. కొన్ని సార్లు మా నామ్మగారు గడ్డితో పచ్చడి చేసుకుని తినే వారంట కూడా!

ఇక మా నానమ్మ గారు వాళ్ళ రోజులలో ఎలా ఉండే వారో కూడా చెప్పే వారు, ఆ రోజుల్లో ఒక్కో సారి నేలంతా సాంబారు తినే వారంట, కూరగాయలు దొరికేది తక్కువ ధరలు ఎక్కువ.
ఆ తరువాత మా నానమ్మ గారికి నాకు తెలిసి 72 సంవత్సరాల వయస్సులో అనుకుంట శరీరం లో సత్తువ నశించి పోయి తినడం తగ్గించేసారు, ఏమిటా అని వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళారు జీర్ణ శక్తి నశించి ఉంటుంది అని మాత్రలు ఇచ్చారు కానీ అవి చెయ్యలేదు పని చెయ్యలేదు, దాంతో scanning తీయిస్తే పొట్టలో కణితి ఉంది అందుకే అని చెప్పారు, అప్పుడు మా నానమ్మకు రెండు పర్యాయాలు శాస్త్ర చికిత్స చేసారు, కానీ కణితి గుండెకు అతుక్కు పోవడం వల్ల కణితి తియ్యలేదు, అప్పుడు మా నానమ్మ మాతో చెప్పారు ఆవిడ పడిన క్షోభ, ఆ 30 రోజులు మంచం మీదే అన్నీ, మా నాన్నగారు ఆయన అన్నదమ్ములు చెల్లెళ్ళు అందరూ మా నానమ్మ ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, ఇక హైదరాబాద్ NIMS వాళ్ళు Chemotherapy ను మొదలు పెట్టారు,  మూడు నెలలకు ఒకమారు అలా తీసుకు వెళ్ళడం రావడం, ఆ ప్రయాణం మా నానమ్మకు నరక ప్రాయం గా ఉండేదంట. ఆ తరువాత 1 నెల క్రితం మందులు మార్చారు, ఆ మార్చిన మందుల దుష్ప్రభావం అనుకుంట ఒళ్లంతా దద్దుర్లు పైగా నాలిక మీద కూడా 15 రోజుల క్రితం బాగా సుస్తు చేస్తే వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళారు, ఆయన రెండు రోజులు Seline ఎక్కించి బ్రతికించారు అనుకున్నాం
కానీ 26 మద్యాన్నం 3:30 నిమిషాలకు మా దగ్గర నుంచీ వెళ్ళి పోయారు.
మా నానమ్మకు ఇవే నా అశ్రు నివాళులు!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.