ఇంత వ్యత్యాసం ఎక్కడా చూడలేదు

ఒక అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయనాయకుడు నిర్లజ్జగా ఒప్పుకున్నాడు, రాజ్యాంగం తూచా తప్పకుండా పాటిస్తున్న అని అన్నాడు, అంటే రాజ్యాంగం లో అక్రమ సంబంధం ఒప్పుకుంటుంది అంటున్నాడా లేక పొతే తనను ఎవరు ఏమీ చెయ్యలేరా అనా?
ప్రజలకు నాయకులు చేస్తున్న తప్పులను చూపడానికి journalism ఎంచుకున్న వాళ్ళు ఇలా తయారవడం ఎంతవరకూ ఆమోదయోగ్యం? భర్తతో విడిపోకుండా ఇంకొకరితో సావాసం చెయ్యడం ఏ రాజ్యాంగం ఒప్పుకుంటుంది?
అయినా రాజ్యాంగం వాళ్లకు ఆడుకునే వస్తువుగా మారిపోయింది అని నిత్యం చూస్తూనే ఉన్నాము!
చదువుకున్న వాడు నాయకుడు కావాలి అని ఉపదేశాలు ఇచ్చేవారు ఇలాంటి వాటి గురించి మాట్లాడరే? వీళ్ళు చదువుకోలేదా?
అంటే ఏమి చదువుకోవాలి?
ఇలాంటి వాళ్లకు భూ బహిష్కరణ విధించాలి కట్టుబట్టలతో!