అసలు వ్రాతలు వ్రాయడం ఎందుకు మానేసాం?

మొదటి కారణం అసలు Blogging అంటే తెలియక పోవడం!
రెండవ కారణం ఎక్కువ గుర్తు పెట్టుకోవలిసిన అవసరం - Need to remember lot's of password.
మూడవ కారణం తానూ నిర్వహిస్తున్న Blog ను ఎవరూ చూడట్లేదు
నాల్గవ కారణం తనని తానూ తను చెప్పాల్సిన విషయం సరిగ్గా వెల్లడించ లేకపోవడం!
అయిదవ కారణం facebook - మనం మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అని తెలిసినా దూరం జరగట్లేదు!
ఆరవ కారణం - ఎక్కువ మంది వ్రాతలు వారి వారి blogs కు వెళ్లి చదువుకోవాలి అనే దురభిప్రాయం - చాలా మందికి RSS feed అనేది ఒకటి ఉంది అన్న విషయం - దాన్నే facebook online లో ఉంచింది
ఏడవ కారణం - ఒకరి వ్రాతను మన స్నేహితులతో ఎలా పంచుకోవాలో తెలియదు - చాలా మందికి post to twitter or re share అనే విధానాలు ఉన్నాయి అన్న విషయం తెలియకపోవడం కూడా కారణం!
ఎనిమిదవ కారణం - ఒక వేళ blog లో rumor వ్రాస్తే ప్రపంచం మొత్తం దాన్ని నిజమా కాదా అని పరీక్షిస్తుంది - అదే social networking లో అయితే మన స్నేహితులే ఉంటారు కాబట్టి మన నైజం వాళ్లకు తెలుసు కాబట్టి వ్రాసినా పెద్ద పట్టింపులు జరగదు!
తొమ్మిదవ కారణం - facebook లాంటి వాటిలో అయితే మనం పంచుకున్న ప్రతులు లేదా చిత్రాలు చోరీ కు గురవ్వావు అనే అపనమ్మకం!

ఇలాంటివి ఇంకొన్ని ఉన్నాయి blogging కు దూరం కావడానికి!

నా మటుకు నేను దూరం అవ్వడానికి కారణం
ఇంకొకరి మీద దురభిప్రాయం పెరిగిపోతుంది అనే భయం, నా వ్రాతలలో చాలా నేను ఇంకొకరి నిందిస్తూ వ్రాసాను అదే జీవితంలో అలవాటు అయిపోతుంది అనే భయం, నాల్గవ కారణం మరియు సమయం వెచ్చించ లేకపోవడం

--
Thanks
Prasad
http://gpv-buddha.blogspot.in
"When you find peace within yourself, you become the kind of person who can live at peace with others ."




No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.