ఇద్దరూ ఇద్దరే!

ఎవరు ఎక్కువ బాధ పడుతారు?
 ప్రజలా?
నాయకులా?
తోకలా?
ప్రభుత్వం విధించే ప్రతీ పన్ను సామాన్యుడి నడ్డి విరగగొట్టడానికి అన్నది జగమెరిగిన సత్యం! వాటిలో మొదటిది ప్రత్యక్ష్య పన్నులు, వాటి పేర్లు
income tax, property tax ఇక municipality లేదా corporation పరిధిలో house tax!
ఇక పరోక్ష పన్నులు
Entertainment tax
tax on gift
tax on import

ఇవి కాకుండా ఇంకా కొత్తవి, మధ్యవర్తుల బాదుడు. మధ్యవర్తులు అంటే వ్యాపారులు అనుకున్నారు, కాదు దొంగలు లంచగొండిలు మోసగాళ్ళు!
ఈ మధ్య ఇంకో కొత్త tax చేరింది అది Advertisement ఖర్చు! ఆడెవడో తెలియని ఒకడికి కోట్లకు కోట్లు ఇచ్చి ఆ ఖర్చు మన నెత్తి మీద రుద్దుతున్నారు!
ఇక మన అంతరాష్ట్ర గొడవలు మనవి! ఊరు దాటాకా తెప్ప తగలెట్టే వ్యవహారం ప్రజల నడ్డి వరగ్గొట్టే transportation tax!
మీ రాష్ట్రం వాళ్ళు వేస్తె తప్పు లేదు కానీ మేము వేస్తే తప్పా  ఆడుగుతారు తప్ప, దాని వల్ల పెరిగే ధరలు గురించి పట్టించుకోరు, కానీ తరువాత ధరలు పెరుగుతున్నాయి అని గగ్గోలు పెట్టి ప్రభుత్వాలది తప్పు అంటారు, కానీ ఇప్పుడు దానికి మద్దతు ఇచ్చిన వారు ఈ విషయం ఒప్పుకోరు!
పోనీ ఒక రాష్ట్రం మీద ఇంకో రాష్ట్రంకు అవసరం లేదా అంటే ఉంది, ఒక రాష్ట్రంకు సముద్రం లేదు ఇంకో రాష్ట్రం కు రాజధాని లేదు.
ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చి  జనాలను రక్షించండి!