ఏమిటా మూడు చిత్రాలు అనుకుంటున్నారా
1. మిర్చి - దీనికి నేను ఇచ్చే సంఖ్య - 3.75/5
2. s/o సత్యమూర్తి - 2
3. శ్రీమంతుడు - 2.7
ఎందుకు అని మీరు ఖచ్చితంగా అడగచ్చు, కారణాలు అనేకం. వాటిలో కొన్ని
మిర్చి అనుకున్నది చూపడానికి సమయం సరిపోయింది శ్రీమంతుడు సమయం సరిపోలేదు, ఇక s/o సత్యమూర్తి అప్పటి వరకూ జులాయి తండ్రి మరణం తర్వాత నీటి మంతుడు అయి తండ్రి పేరు సార్ధకం చేసాడు.
ఇక శ్రీమంతుడు ఎందుకు ఎక్కువ అని చూస్తె
1. కథ
2. అసలు శ్రీమంతుడు ఏమి చేద్దాం అనుకున్నాడో ఖచ్చితంగా నిర్వచనం ఇచ్చాడు!
3. మంచి చేస్తున్నప్పుడు చెడు నిలబడుతుంది కానీ ఆ చెడును దాటాలి అని నిరూపించిన శ్రీమంతుడు!
కథా పరంగా సమాజంతో బ్రతకాలి అనే శ్రీమంతుడు, దాన్ని ద్వేషించే బంధువులు (తల్లి చిన్నాన్నా తప్పించి), ఊరును కాపాడాలి అనుకునే ఒక వ్యక్తి ఆ ఆశయాలు అమలు పరచాలి అనుకునే కూతురు! ఇక ఆ కూతురు శ్రీమంతుడిని కలిసి అతని జీవితానికి ఒక గమ్యం చూపిస్తుంది, తన ఆశయాలకు అనువుగా ఉండటంతో ఆ శ్రీమంతుడు ఆ పంథా ఎన్నుకుంటాడు!
ఆ పంథా లో కొన్ని నిజాలు తెలుసుకుంటాడు. ఒజ శ్రీమంతుడి లక్షణాలు కూడా చూపిస్తాడు అవి
1. చెడ్డ వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తాడు !
2. కష్టాలలో ఉన్న ప్రజల కోసం నిలబడతాడు!
3. సాయపడ గలిగిన చోట సాయం చేస్తాడు!
4. ప్రజలకు మార్గాలు చూపిస్తాడు!
5. దత్తత నిర్వచనం చెపుతాడు!
6. అన్ని ప్రయత్నాలు విఫలం అయితేనే ప్రతి సంహారం చెయ్యాలి అని కూడా నిరూపిస్తాడు!
మరి ఇన్ని మంచిలు కనిపిస్తే అంత తక్కువ ఎందుకు అంటారా?
సమయా భావం వల్ల శ్రీమంతుడిని సరిగ్గా చూపలేదు, తండ్రి కథ చాలా తక్కువ! కథా నాయిక నప్పలేదు! తల్లి చిన్నాన్న పాత్రల వల్ల తనకు సమాజ సేవే జీవిత పరమావధి గా ఎన్నుకున్నాడు అని జనాలు ఊహించుకోవాలి కాబట్టి!
యుద్ధ సన్నివేశాలు అంత బాలేదు! ఇక ప్రతి నాయకులు నాయకుడి వల్ల తాము ఓడిపోయాం అని చెప్పడం వల్ల ప్రతి నాయకులకి శ్రీమంతుడు అంటే ఎందుకు కోపం పెరిగింది అని తెలుస్తుంది చూపించ గలిగి ఉంటే బాగుండేది!
--
Thanks
Prasad
http://gpv-buddha.blogspot.in
"When you find peace within yourself, you become the kind of person who can live at peace with others ."
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.