మళ్ళి ౧౯౪౭ ముందుకు వెళుతున్నామా?

ఇప్పుడు పరిస్తుతులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది.
నిన్నటికి నిన్న శరద్ పవార్ చేసిన Statement ప్రత్తి ఎగుమతులు పెంచాలి అని చూస్తున్నాము.
అప్పుడు మనం మన దేశంలోని ముడి సరుకులను పరాయి దేశాలకు పంపి అక్కడినుంచి తయారైన సరుకులను మన దేశానికీ తీసుకు వచ్చి ఇక్కడ అమ్మే వారు.
ఇప్పుడు అదే జరుగుతుంది దాన్ని ఇంక పెచడానికి ప్రయత్నిస్తున్నారు.
మనం సరిగ్గా ఉంది ఉంటె ఇలాటివన్నీ అగుతయేమో?
ఎందుకు అంటారా ఏమైనా అంటే
ఒక Adidas T-Shirt లేక పొతే ఒక Nike T-Shirt లేక పొతే ఒక lee ఇలా చెప్పుకుంటూ పొతే మనం వాడే దుస్తులలో సగం పైగా పరాయి దేశాలనుంచి వస్తున్నావే.
నేను అవి వాడడం తప్పు అనట్లేదు కాని మనం కొంత సమంజసంగా ఉండాలి అంటున్నాను. మన దేశంలో చేనేత కార్మికులు ఆత్మ హత్యలు జరుగుతున్నాయి ఎందుకు ఎప్పుడైనా మనం తయారు చేసిన దాని మీద లాభం వస్తే మనం చేసిన అప్పు తీర్చగలం లేకపోతె ..
మూడు వేలు నాలుగు వేలు పెట్టి చింపిన దుస్తులు కొనడానికి సంసయించము  గాని నాలుగు వందలకు వచ్చే అమ్మో చీరే నేను కట్టలేను అనే స్టాయికి వెళ్ళి పోయారు(కొంత మందిని అడిగితె చీర చాలా బరువుగా ఉంటుంది పైగా కట్టు కోవడం కష్టం అన్నారు). ఏది ఏమైనా ఒక్క ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు(అది Already అసమర్ద ప్రభుత్వం కదా). మనం చేతనైనంత సయం చేసి వాళ్ళని నిలబెడదాము.
ఇది నా విన్నపం మాత్రమే నచ్చితే స్వీకరించండి లేక పొతే ౧౯౪౭ ముందుకు తీసుకు వెళ్ళండి.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.