ఎన్ని అక్రమాలు జరుగుతున్నా చిన్న వాటిమీదకి ఎందుకు దృష్టి మరలుస్తారు


ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ పక్కకి నెట్టి చిన్న చిన్న అక్రమాలు మీదకి దారి మరలుస్తారు. ఇది అది నుంచి వస్తున్నదే.
ఇప్పటి వరకు 2G Spectrum కుంభకోణం సంబంధించి ఒక అడుగు ముందుకు వేయలేదు.
Swiss bank నుంచి ఒక్క రూపాయి నల్లదనం బయటకు రాలేదు.
రక్షణ శాఖలో అవినీతి తిమింగలాలు ఎన్నో ఉన్నాయి(Adarsh కుంభకోణం ఒక ఉదాహరణ).
 ధరలు కిందకి దిగిరావట్లేదు.
గాంధీ ఆశయాలు నకిలీ గాంధీలు నాశనం చీస్తున్నారు.
 వీటి గురుంచి ఏమీ జరగట్లేదు గాని చిన్న తిమింగలాలను బయటకి లాగడానికి చూస్తున్నారు.


ఇక పొతే ఎందుకు చిన్న అక్రమాల మీదకి ఎందుకు దృష్టి మరలుస్తున్నారు అన్న దానికి ఇవి నా యొక్క అభిప్రాయాలూ 
౧. కేంద్రంలో congress రాష్ట్రంలో వేరే party (మన రాష్ట్రంలో కాదు)
౨. ఇదివరకు కంచుకోట ఇప్పుడు అక్కడ నుంచి ఒక్క చిల్లి గవ్వ కుడా రావట్లేదు.
౩. బడాబడా Realtors మరియు పారశ్రామిక వేత్తలు ఎప్పడినుంచో ఒక party అండతో బతికారు ఇప్పుడు కొత్త party తో ఆశలు పొసగట్లేదు.
౪.   ఇకపోతే మన వార్తా సంస్థలు వాటికి ప్రజలకు న్యాయం చేద్దాం అన్న ఆలోచన అప్పుడో పోయింది ఎప్పుడు ప్రజలను Break చేసే వార్తా వస్తుందా అని చూడడమే తప్ప వేరే పనిలేదు. వాళ్ళకి ఎప్పుడూ కొత్త వార్తా కావాలి. ఇప్పుడు వేరే చిన్న తిమింగలం(బలహీనమైన party) పట్టిస్తే పెద్ద తిమింగలం(బలవంతమైన party) గురుంచి పట్టించుకోరు అని. వాళ్ళకి ఇలాంటి వార్తలే కడుపు నింపుతాయి ఎందుకంటే ఒక party ఇంకొక party నీ హింసిస్తే అక్కడ ఇక్కడ వాళ్ళని కూర్చో పెట్టి ఒక రెండుగంటలు సుత్తి కొట్టించి పబ్బం గడుపు కోవచ్చు కదా అందుకు. మళ్ళి దీని గురుంచి reviews అని అదని ఇదని power waste చెయ్యాలి కదా.
౫. ఇక పొతే రాహుల్ గాంధి మొన్న ఒక statement "మాది సంయుక్త కూటమి కాబట్టే ధరలు అదుపు చెయ్యలేక పోతున్నాము" అంటే దాని అర్ధం congress party అంత Realtors, Industrialists, Mediators etc తో నిండి పోయిందనా? అది అందరికి తెలుసు వేరే కొత్తది ఏమైనా చెప్పడానికి లేదు. ప్రతిపక్షం నోరు ముయ్యాలి అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు అని చూపించాలి కదా. 

ప్రజలని మరచిపోతున్నారు ఎప్పటికైనా తప్పు తప్పే. దేశం కోసం పనిచెయ్యండి. డబ్బులు కావాలి బ్రతకడానికి మాత్రమే. నేను ఈ post చేసింది BSY నీ support చేసి మాత్రం కాదు. ఈ రోజు వార్తలు ఏది పెట్టిన ౩౦ నిమిషాల నివిడిలో ౧౦ నిమిషాలు Karnataka పరిస్థుతులే. మన దేశం లో ఇంకా ఏమీ చెడు జరగట్లేదు అన్నట్టు ఉంది.........



అనవసరంగా విద్యుత్తు వృదా చెయ్యద్దు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు అంటే మనలో శక్తి ఉన్నంత కాలం సమాజానికి మంచి చెయ్యమని ఇది నా అభిప్రాయం.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.