మనం ఎప్పుడు మారతాము? ఈ చెత్త రాజకీయాలనుంచి ఎప్పుడు బయటపడతాము ?

చెప్పలేము
౧.ఎందుకంటే తండ్రి సంపాదించినా దానిలో కొడుకు /కూతురు ఎంత కష్టపడి సంపాదించావు నాన్న అని అడగరు కనుక .
౨.ఎందుకంటే ఇంకొకడు ఆకలి తో చనిపోతున్న నా దగ్గర ఉన్న లక్ష్మి పోకూడదు అనుకునే వాళ్ళు ఉన్నత కాలం.
౩.దైర్యంగా నిజం చెప్పనంత కాలం.
౪.తప్పు మనలో పెట్టుకుని ఇంకొకరిని దూషించినంత కాలం.
౫.ఎదుటవారిని నమ్మనంత కాలం.
౬.తండ్రి తరువాత వారి వారసత్వంగా మనలని పాలిస్తున్నంత కాలం.

పైనవ్రాసిన వాటన్నిటికి నా దగ్గర సరైన సమాధానం ఉంది మీరు ఆలోచించికింద చూడండి












౧. ఎవరైనా అడిగితేనే మనం ఆలోచించేది అప్పుడు మనం ఆలోచిస్తాము మనం చేస్తున్నది తప్ప ఒప్పా అని .
౨. వాడు చనిపోతున్నది నువ్వు దొంగతనంగా(ధరలు పెంచి) సంపాదించిన లక్ష్మి వల్ల అని .
౩. నిజం చెబితే మంచే జరుగుతుందని అందరికి తెలుసు వేరే చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను.
౪. ఇంకొకడిని దూషిస్తే వాడే తప్పు చేసాడని అందరు నమ్ముతారు కాని తప్పు ఎప్పటికైనా తప్పే అది విషం కంటే ప్రమాదకరమైనది
౫. నమ్మడం మొదలుపెట్టు మీకు తెలుస్తుంది ఎన్నాళ్ళని మనలని మోసం చేసి తమ మన సాక్షిని చంపుకోగలరు.
౬. ఇది మాత్రం నిజం మా నాన్నగారు ఆశలు వేరు మా ఆశలు వేరు ఆశే ఒకటికానప్పుడు వారి ఆశయాలను ఏమి నిలబెట్టగలము. ఇది అందరికి తెలిసిన నిజం కాని ఏమి చెయ్యలేని పరిస్థితికి వెళ్ళి పోయాము.
ఇన్ని కారణాలు పెట్టుకుని మారాలి అనుకోవడం నా తప్పు నేను మాత్రం ఎప్పడికి నేనే అనుకోకుండా నువ్వు ఇలా ఉండడానికి ఇంకొకరు ఉన్నారు అని గుర్తించు సోదరా 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.