ఎప్పుడూ లాభ పాడేది వ్యాపారస్తులే కాని వ్యవసాయం చేసే వాళ్ళు కాదు.
ఎందుకు అంటారా తెలివైన వాళ్ళు వీళ్ళకి ఎలా జనాన్ని మోసం చెయ్యచ్చో సలహాలు ఇస్తారు.
దానిలో మొదటి వాళ్ళు Scientists - ఎలాగా అనుకుంటున్నారా అదే artificial ripening.
ఇదేమిటి ఇలా సమయం సందర్బం లేకుండా మాట్లాడు తున్నాడు అనుకుంటున్నారా కాదు సమయం వస్తుంది. ఇంకొన్ని రోజులలో మామిడి పళ్ళు వస్తాయి వాటిని అలాగే పండబెడుతున్నారు. మరి ఇంకెన్నాళ్ళు మనం కలుషితమైన ఆహరం తినాల్సి వస్తుందో?
రోజు రోజుకి ఆహారాన్ని కలుషితం చేసే విధానాలు తయారు అవుతున్నాయి. అయిన ఏమీ చెయ్యలేము తయారైన దానిలో సగం పైగా నిల్వ చేస్తున్నారు ఎందుకంటే మనకి దొరికే mazaa లేదా frooty మామిడి పండు గుజ్జు తో తయారు అవుతుంది. సంవత్సరంలో ఒక్కసారి పండే పంటతో సంవత్సరం పొడుగునా ఎలా అందించగలరు. ఇక పొతే దీని వల్ల మనం ఎంతో ఇంధనం waste చేస్తున్నాము. వాటి లెక్కలు నాకు తెలియవు కాని మనం చేస్తున్న waste వల్ల మనమే నష్ట పోతున్నాము.
ఇది వ్రాసిన ముందు రోజు నేను ఫ్రూటి తాగాను. దాని మీద "మామిడి గుజ్జు తో తయారు చేసింది అని ఉంది" అప్పుడు ఒక అనుమానం వచ్చింది మామిడి పళ్ళు ఇప్పుడు రావు కదా అని. మరి తాగే ముందు ఒకసారి ఆలోచించండి దానిని తాగిన తాగక ముందు ఎంత చెత్త తయారు అవుతుందో
తాగాక ముందు
౧. నిల్వ చెయ్యడానికి power wastage
౨. దాచి ఉంచడానికి చాలా స్థలం.
౩. మళ్ళి దాని నుంచి రసం తయారు చెయ్యడానికి ఎంత ఖర్చు
౪. రసాన్ని ఉంచడానికి మళ్ళి చిన్న అంగడిలో మళ్ళి power wastage.
తాగిన తరువాత
౧. Tetra pack అయితే నాకు దాని గురంచి తెలియదు.
౨. Plastic Bottle అయితే అది మళ్ళి వీధిలో చెత్త కింద పేరుకు పోతుంది.
మరి ఇన్ని అనర్ధాలు ఉన్న Packed juices తాగడం అవసరమా కానే కాదు. ఇవన్ని తెలిసి కూడా ఎందుకు ఆపలేము.
ఎందుకంటే ఇంకక లాభపడేది మళ్ళి వ్యపరస్తుడే కాబట్టి.
సామాన్యుడు ఏమైనా పర్వాలేదు
అయిన ఎప్పుడూ అంతే కదా !
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.