మళ్ళీ మొదలు పెట్టాడు


'I assure you, after 10 years, you will be proud of your decision, and the country's politics will take a new direction'
ఇంకా పదేళ్ళు కావాలంట
అవును ఇతను మళ్ళి బయటకు ఎందుకు వచ్చాడు?
ఓహో ఉల్లిపాయ ధరలు తగ్గాయి కదా అందుకేమో .
ప్రజలకి సహాయం చెయ్యాల్సిన సమయంలో ఎక్కడ ఉంటాడో తెలియదు అవసరం లేని సమయంలో వచ్చి నానా ఆర్భాటం చేస్తాడు.

ప్రతి Religion ఆపదలో ఉన్నవాడిని ఆదుకో అన్నాది. మరి మేము కష్టాలలో ఉన్నప్పుడు ఏమైపోయావు ఇప్పుడు వచ్చి మాకు ఈ నీతి వాఖ్యాలా!
ఇకపోతే నల్లధనం నీ అధినంలో ఉన్నది మొదట బయటకి రానివ్వు అ తరువాత మిగతా వాళ్ళ సంగతి ఆలోచిద్దాము (కంచే చేను మేస్తే ?)

అన్నిటికన్నా ముఖ్యమైనది 'Political parties lack democracy' అంటే మేము వచ్చినా మమ్మలిని రానివ్వరన్నమాట, అయినా వచ్చి ఏమీ పీకగలము. మొత్తం ధనమంతా దోచుకుని విదేశాలలో దాచుకుంటున్నారు ఇక మన దేశంలో ఇంకా ఏమీ మిగిలింది సహాయం చెయ్యడానికి ! ఓహో తప్పు అప్పుడు జరిగినా ఏమీ తెలియని మామీదకి వస్తుందని కదా మమ్మల్ని రమ్మంటున్నది ! అయినా Democracy meaning నీకు ఏమీ తెలుసు. ఎవరో చేసిన మంచి పని చెప్పుకుంటూ ఇప్పటికి బతికేస్తున్నావు. నువ్వు పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ నీ నియోజక వర్గంలో ఎన్ని రోజులు కనిపించావు? నీ dairy లో ఎప్పుడయినా మీ నియోజక వర్గంలో ఉన్నావు అని వ్రాసుకున్నవా?
మొదట నువ్వు అర్ధం తెలుసుకో
For the people - నిన్ను ఎన్నుకున్న ప్రజల గురుంచి పనిచెయ్యి
By the People - నిన్ను ఎన్నుకున్న ప్రజలని భాగస్వాములని చెయ్యి
To the People - నిన్ను ఎన్నుకున్న ప్రజలకి ఏదైనా మంచి ఇవ్వు
వీటి అర్ధాలు నీ దృష్టిలో ఇలా ఉంటె నేను ఏమీ చెయ్యలేను "
For the People - నన్ను ఎన్నుకొని ప్రజల గురుంచి (అదే భూస్వాములు దగాకోరులు లాంటి వాళ్ళు)
By the people - నన్ను ఎన్నుకొని ప్రజలని భాగస్వాములని చేసి (వాళ్ళ ద్వారా నాకు నచ్చని వాళ్ళని అణగదొక్కి)
To the People - నన్ను ఎన్నుకొని ప్రజలకి ఏదైనా ఇచ్చి(వాళ్ళకి సొమ్ము నల్ల ధనంగా మార్చుకోవడానికి అవకాసం ఇచ్చి)"

ఇప్పటికే అయిదేళ్ళకి వస్తున్నా elections వల్ల చాలా నష్టపోతున్నాము అంటే ఇంకో పదేళ్ళు మిమ్మల్ని నాయకులుగా ఉంచాలా! ఇంకేమైనా ఉందా అప్పుడు భవతి బిక్షందేహి అవుతుంది మా పరిస్థితి.

"నువ్వు చెయ్యగలిగితే చెయ్యి అంతేగాని మేము రావట్లేదు అని మీరు వస్తే బాగుంటుంది అని సలహాలు ఇవ్వకు. "

నీ సుత్తి వినివిని bore కొడుతుంది - ఎప్పుడూ పాత చింతకాయ పచ్చడిలాగా అదే సుత్తి వద్దు.   

ఏమిటి రా వీడి గోల అని మీరు అనుకున్నా ఇంకో పదేళ్ళు నేను వాడిని చూడదలుచుకోలేదు!!!!!!
ఇప్పటికే చాలా ఎక్కువ అయ్యింది.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.