అనగనగా అనగనగా

ఒక రాజు ఉండే వాడు 
ఆ రాజుకి డబ్బు పిచ్చి 
ప్రజల మీద బాగా శిస్తులు విధించి ఆస్తులు బాగానే కూడా పెట్టాడు, వాళ్ళకి సామంత రాజులు కొంత సహాయం చేసారు.
బ్రతికినంత కాలం ఆ ఆస్తులని కాపాడుకోవడానికే బ్రతికాడు, కాని ఒక రోజు ప్రజలంతా ఎదురు తిరిగి వాడి నుంచి డబ్బు లాక్కుని వాడికి తగిన శాస్తి జరిపారు...................
కాలం మారింది
Tax అనే ఒక అస్త్రంతో ప్రజలమీద ముందు వెనక చూడకుండా డబ్బులు దంచుకుంటున్నారు. మరి వాళ్ళు డబ్బులు కూడా బెట్టాలి కదా అని ఆలోచించారు.......
కూడబెట్టారు ఎలాగంటే 
౧. నిధులు దారి మార్చి.
౨. ఎక్కడైనా కొత్తగా SEZ వస్తుంటే ముందే అక్కడ స్థలాలు కొని(అంటే లాక్కుని) ఎక్కువ ధరలకి అమ్మి.
౩. ప్రాంతీయ అసమానతలు సృష్టించి.

ఆ రాజు తెలివి తక్కువ వాడు కాబట్టి ప్రజలని విడగోట్టలేక పోయాడు.
కాలం మారింది ఇక్కడ వీళ్ళు తెలివి ముదిరిన వాళ్ళు ప్రజలని విడగొట్టి, అసమానతలు పెంచి డబ్బు కొల్లగొట్టారు.
మరి ఇప్పుడు మనం ఎదురు తిరగగలమా లేదు ఎందుకంటే మనం ముందే విడిపోయాము.
అదే కలియుగం 
మనం ఇంకొకడిని నమ్మము 
దేవున్నీ నమ్మము 
మనల్నే నమ్మము  

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.