ఎనిమిది తలుపులు పదహారవ భాగం

విన్నీ కి ఆరోజు అనుమానం వచ్చింది, తనకి నమ్మకం కలిగించి ఎలాగోలా తరువాత రోజు మళ్ళీ వచ్చాను. ఆ Injection నాకు నిద్రలేకుండా చేసేసింది. అది పంపినవాడు దొరికితే నాలుగు తగిలించాలి అని అనుకునేవాణ్ణి.
ఇక తరువాతరోజు అంటే ౩౦/౧౦/౨౦౩౯(30/10/2039) నాడు ఈ ఉపకరణం బాగు చేసి దానికి పేరుకూడా పెట్టాను.ఈ సాధనానికి పేరు "కాల ఉపకరణం"


ఈ కాల ఉపకరణం శక్తి, దరిదాపు ౧౫ రోజులు పనిచేసే లాగా మార్చాను. మరి ఇప్పుడు గతమంతా చూడడం మొదలుపెట్టాను.

నాకు ప్రణతి(సాహితీ) ఇచ్చిన CBI ప్రతిలో ఒక అంశం నన్ను ఇంకా వేధిస్తుంది, అదే Multi personality disorder.
దాని గురుంచి పక్కన పెడితే, ఇది నిజం అని నిరూపించే కొన్ని సంఘటనలు ఈ ఉపకరణం తో బయట పడ్డాయి.
అందులో ముఖ్యంగా నా గతంలో చిత్ర విచిత్రమైన పనులు ఈ ఉపకరణం తో చేసాను. నీకు నవ్వు తెప్పించవచ్చు కానీ దీనితో చాలా డబ్బులు ఆదా చేసాను.
నీకు ముందుగా చెప్పినట్టు దీని కక్ష్య ౨ KM కాదు అనన్యం. దీనికి నేను అక్షాంశం రేఖాంశము ఇస్తే ఇది ఆ ప్రదేశానికి తీసుకు వెళ్ళేది.
ఇలాంటివి విన్నీ దగ్గర పనిచేసే ప్రతీ ఒక్కరి దగ్గర ఉండేవి కానీ వాటిలో ప్రదేశం మాత్రమే చేరుకోగాలము వాటికి గతంలోకి వెళ్ళగలిగే శక్తి లేదు. ఎలా ఆదా చేసాను అనేకదా నీ ప్రశ్న. చూడు ఒక చక్కటి ఉదాహరణ.
విన్నీ కి చాలా Cement industries ఉన్నాయి. మరి వాటి నుంచీ Cement వేరే ప్రదేశానికి తీసుకు వెళ్ళాలి. ఈ ఉపకరణం Time portal ఉపయోగించి Petrol/Diesel అదా చెయ్యడం ఆ Driver's కి చూపించే వాడిని.
ఉదాహరణకు ఒక Cement బస్తా మా ప్రదేశం నుంచీ రాష్ట్ర రాజధానికి తీసుకు వెళ్ళడానికి అయ్యే ఖర్చు దరిదాపు ౩౦౦ రూపాయలు. Cement బస్తా తయారీకి ఖర్చు ౧౦౦, మొత్తం వెరసి ౪౦౦ రూపాయలు అయ్యేది. కానీ ఈ ఉపకరణం తో ఎక్కడైతే Toll gate దాటాలో అక్కడకి చేరుకునే .అక్షాంస రేఖాంశాలను పెట్టి చివరకు రాజధానికి అయ్యే ఖర్చును పావు చేసేసాను అంటే అయ్యే ఖర్చు ౭౫ మాత్రమే అంటే మొత్తం ౧౭౫. కానీ లెక్కలలో ౪౦౦ చూపించి దండుకునే వాడ్ని.

దీనితో చేసిన మోసాలు అనన్యం. మరి నిన్ను ఎందుకు ఇన్నాళ్ళు కనిపెట్టలేక పోయాం అనుకుంటున్నావు కదా, దీనికి అక్షాంస రేఖాంశాలు కావాలి మీ తాత అవి నాకు తెలియనివ్వలేదు.
ఇదంతా నాణానికి రెండవ ముఖం(అసలు ముఖం)
(సశేషం..)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.