ఎనిమిది తలుపులు ఇరవైనాలుగవ భాగం(పాపాల సామ్రాజ్యం)

అది రావల్..
నన్ను అర్జున్ దగ్గరకు తీసుకు వెళతాను అన్నాడు.
ఇక్కడికి అంతా మోసానికి గురైనవాళ్ళు మాత్రమే ఉన్నారు అనుకున్నాను మరి నీ మామగారు కూడా ఎందుకు ఉన్నారో అర్ధం కాలేదు.
తనకి నేను వస్తాను(అదే Surrogate) తెలుసు.
అతనిది ఒక వింత బాధ.అతని భార్య నిషా తనకు వదిన మాత్రమే కాదు విన్నీ Classmates అట. మరి నీకన్నా పెద్దది కదా నిన్ను ఎలా పెళ్ళి చేసుకుంది అని అడిగాను.

రావల్: పెద్దదే కానీ నేను మా College లో Champion ని, మంచి కండలు తిరిగి అప్పట్లో మా నాన్నగారు MLA కావడంతో తనకి నన్ను వాడుకోవాలి అనుకుంది. నన్ను తన చుట్టూ తిప్పింసుకుని నన్ను పెళ్ళి చేసుకుంది.
Surrogate: Problem ఏమిటి.
రావల్: పెద్దది కదా ఎప్పుడూ తనదే ఆధిపత్యం. నన్ను ఏపనీ చెయ్యనివ్వదు. ఒక వ్యాపారం మొదలు పెడదాము, MBA చేద్దాము అనే కొరికి అవన్నీ తొక్కేసింది. ఇంతలో మా అక్కతో నీ పెళ్ళి.
Surrogate: ఏమిటి నువ్వనేది నేను మీ అక్కను పెళ్ళి చేసుకున్నానా.
రావల్: నువ్వు గగన్ వి అని నాకు తెలుసు, ఎవరు Surrogate ఎవరు కాదో తెలిసే Device నాదగ్గర ఉంది.
Surrogate: దొరికిపోయాను. సర్లే మరి నిన్ను మీ నాన్నగారిని చంపిన నన్ను ఎందుకు వదిలేశావు.
రావల్: నువ్వో పిచ్చోడివి, నీకు కోపం వస్తే ఎవ్వరూ ఉండలేరు, ప్రేమ ఉంటే నిన్ను ఎవ్వరూ వదలరు. నువ్వు చంపావు అని నువ్వను కుంటున్నావు, కానీ జరిగింది వేరు. మా అక్క ఒక మంచి Master plan వేసి నిన్ను తీసుకు వచ్చింది. నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరిలో మంచి Hacker వి, నీకు మా అక్క అంటే ఇష్టం. మా అక్క నిన్ను ఉపయోగించుకుని తన పనులన్నీ చేయించుకోవాలి అనుకుంది. ఒక సారి మీరు Onsite వెళ్లారు కదా అప్పుడు నీలో ఇంకో రూపాన్ని మా అక్క చూసింది. అది నీలో ఉన్న Split personality disease. ఒక రోజు తను అక్కడ ఉన్న Banking system ని Hack చెయ్యడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నీలోని Split personality బయట పడింది. తను నానా తంటాలు పడినప్పటికీ Banking server లోకి వెళ్ళ లేక పోయింది. నువ్వు ఒక్క రాత్రిలో చేసేసావు. తరువాత కొన్నిరోజులకు మీ ఇద్దరి మధ్య మాటలు పెరిగి, మా అక్కకు నువ్వంటే ఇష్టం పెరిగింది.
నీకేమో డబ్బు మీద పిచ్చి కాదు, మా అక్కంటే మా అక్కకేమో డబ్బంటే తరువాత ఏదో ఒక మూల నువ్వంటే.
Surrogate: కాదు ఇంకా ఏదో జరిగింది, నీకు తెలిసుండదు.
రావల్: నాకు తెలిసింది ఇది మాత్రమే.
Surrogate: మనమిద్దరం, మీ తండ్రిని చంపినా వారి గురించి మాట్లాడు కుంటున్నాము కదా, ఇదంతా ఎందుకు?
రావల్: సరే! ఇంటికి వచ్చాకా మా నాన్నగారికి చెప్పింది. అప్పటి వరకూ పెళ్ళి అంటే చేసుకోను అన్న కూతురు మారింది అనుకున్నారు, పెళ్ళి అయ్యింది అంతా బాగానే జరుగుతుంది. కానీ నిజం వేరు. ఇంట్లో తెలిసింది. మీ ఇద్దరూ కలిసి పెద్ద కుట్ర పన్నుతున్నారు అని.
Surrogate: దానీకే నేను చంపెసానా?
రావల్: మాళ్ళీ మొదటికి వచ్చావు నువ్వు కాదు చంపింది. నీ భార్య. నువ్వు ఆరోజు భయపెట్టావు. విన్నీ నువ్వు ఉపయోగించిన కత్తి తీసుకుని అమ్మనీ నాన్నని చంపింది.
Surrogate: విన్నీ ఇంత చెడ్డదా?
రావల్: అవును, మరి ఇది తెలిసి నేను చాలా భయపడ్డాను. నాకు ఇంకో గండం నా భార్య నిషా, తనకి డబ్బు పిచ్చి కాదు నువ్వంటే కోపం. తను ప్రతీ సారీ వేసిన పడకం నువ్వు పాడు చేసేసే వాడివి.
Surrogate: పధకం ఏమిటి నేను పాడు చెయ్యడం ఏమిటి?
రావాల్: 17-04-2010 నాడు మీకు పెళ్ళి అయ్యింది కదా అసలు కధ అదే, అసలు నిషా వాళ్ళ అన్నయ్యకి విన్నీ ఇచ్చి పెళ్ళి చేయించాలి అనుకుంది. నువ్వు చేసిన పనికి ఆ పధకం పాడయింది, అప్పుడు నన్ను పెళ్ళి చేసుకోవడానికి మా College లో చేరి, నన్ను పెళ్ళి చేసుకుంది. ఇదొక్కటే కాదు నిషా అన్నయ్య, ఒక Police. తనని నువ్వు చంపించావు అని తన అనుమానం. ఇది నాకు కూడా తెలియదు. నువ్వేమో Second గగన్ అయితే తప్ప దీని గురుంచి చెప్పలేవు.
Surrogate: మరి నన్ను అప్పుడు అదే మా పెళ్ళి తరువాత , ఎందుకు బెదిరించావు?
రావల్: అది నా ఖర్మ, నువ్వే చేయించి నన్ను అడుగుతావా?
Surrogate: నేను చేయించడం ఏమిటి?
(సశేషం..)
ఇదం జగత్..