ఎనిమిది తలుపులు ఇరవై ఏడవభాగం (తప్పు లాభం మొదటి భాగం)

రావల్: నువ్వు చంపే ముందు మీ నాన్నకి ఒక Mail పంపేవాడివి. నేను పలానా వ్యక్తిని పలానా చోట ఈ సమయంలో చంపతాను, కాపాడగలిగితే కాపాడు అని.
Surrogate: ఎందుకు?
రావల్: ఎంత చెడ్డయినా నువ్వూ మనిషివేకదా. అప్పుడు ప్రకాష్ గారి దగ్గర ఉన్న Space transit device ద్వారా నువ్వు చంపడానికి ప్రయత్నించిన ప్రదేశానికి వెళ్ళి ఇంచుమించు ౩౦ నిమిషాల ముందు అక్కడ ఒక Surrogate ని పంపించేవారు. వాడు వాళ్ళని తీసుకు వచ్చి అతని స్థానంలో Surrogate ని పంపేవారు. నువ్వు చంపేది ఆ Surrogate ని మాత్రమే.ఇప్పటి వరకూ నువ్వు ఎవ్వరినీ చంపలేదు, నువ్వు చంపలేవు అది నీ నైజం. ఒకసారి భరత్, మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఒక Trick ఉపయోగించావు. అది ఈ సారి ఒక Surrogate ని చంపుతాను అని మీ నాన్నగారికి Message పంపావు.
మరి మీ నాన్నగారికి ఎలా తెలిసింది అనేకదా, నీ మీద అనుమానం ఎలా వచ్చింది అనే కదా. ఎంత తెలివిగా Plan వేసినా ఎక్కడో ఒకచోట తప్పు వేస్తారు కదా అదే నువ్వూ చేసావు. ఎవరినైనా కంగారుగా మాట్లాడిస్తే వాళ్ళు ఆ కంగారులో నిజాలు చెప్పేస్తారు.
అప్పుడు ఏమి జరిగిందంటే

ప్రకాష్ Surrogate: నీ పేరు
గగన్ Surrogate: ....
ప్రకాష్ Surrogate: ఊరు
గగన్ Surrogate: ....
ప్రకాష్ Surrogate: నా పేరు తెలుసా....
గగన్ Surrogate: తెలీదు..
ఇలా కొన్ని ప్రశ్నలు వేసి ఆ conversation  వేగవంతం చేసి చివరిగా ఒకే ఒక్క ప్రశ్న వేసారు
ప్రకాష్ Surrogate: నీ పుత్రుడి పేరు
గగన్ Surrogate: భరత్
అంతే
ప్రకాష్ Surrogate: నువ్వు Surrogate వి నిన్ను నేను తీసుకు వెళ్ళను.

అక్కడ నుంచీ ప్రకాష్ గారు ఆయన space portal device లో కొన్ని మార్పులు చేసారు.
నువ్వు చేసిన తప్పుకు ప్రకాష్ గారికి మంచి ఆలోచన్ వచ్చింది, ఆరోజు నుంచీ ప్రకాష్  ఆ Space portal నుంచీ ఆయన తయారు చేసిన Surrogate తప్ప వేరే ఏ విధమైన Electronic Item దాటలేదు.

అలాగ చాలా మార్లు జరిగింది.

ఒకరోజు నీ దగ్గరనుంచీ ఒక mail వచ్చింది, ఈ మారైనా మనం దశరా కలిసి చేసుకుందాము అని.

నీ దగ్గరనుంచీ భరత్ కు ప్రాణ హాని ఉంది మరి ఎలాగా అని. నువ్వుంత వరకూ భరత్ కు ప్రాణ హాని లేదు కానీ నీలో రెండో రూపం వస్తే మాత్రమే. అందుకు మీ నాన్నగారు ఒక ఉపాయం ఆలోచించారు..
(సశేషం ..)