ఎనిమిది తలుపులు ఇరవై ఆరవ భాగం (పాపాల సామ్రాజ్యం మూడవ భాగం )

రావల్: నిన్ను చూసి చాలా మంది Inspire అయ్యారు. వారిలో చాలా ముఖ్యంగా మత్తు మందుల వ్యాపారులు, వాళ్ళ దగ్గర సరుకు అయిపోతున్న సమయంలో కొంతమంది దొరికిపోయేటట్టు చేసి వాళ్ళ దగ్గర సరుకు అయిపోయింది అని తెలిజేసేవారు. మన చట్టాలు నీలాంటి వాళ్ళ చుట్టాలు.
Surrogate: నువ్వుకూఒడా చేసేవాడివి కదా
రావల్: నేను ఎప్పుడూ చెయ్యలేదు, మొదటి సారి మా అక్కకి Gun black point లో పెట్టి భయపెట్టాను కదా అనేకదా. అది చేయించింది అక్క. అక్కకి ఆ Middle class life నచ్చలేదు. ఎలాగైనా భయటపడాలి అని అనుకునంది. అందుకే అంత పెద్ద నాటకం ఆడింది. అక్కకి నీ గురించి ముందునుంచే నీ Split personality గురుంచి తెలుసు. నువ్వు అక్కడే ఉంటే నీ తెలివి తేటలతో వేరే వాళ్ళు బాగు పడతారు, అదే అక్కడ ఉంటే అక్కకూడా నీలాగే Middle Class life లో ఉండిపోతుంది అని భయం.
నువ్వు ఇంటికి రావడం నిషాకి ఇష్టంలేదు. అందుకే నిషాకి నువ్వంటే కోపం. నిషాకి నీ మీద చాలా నమ్మకం నువ్వు ఎలాగైనా ఇక్కడ నీదైన శైలిలో మమ్మల్ని నీకోసం పనిచేయించుకుంటావు అని అదే జరిగింది. అప్పటికే నీ మీద పీకలోతుల్లో కోపం ఉంది. అందుకే నిన్ను చంపించడానికి చాలాసార్లు ప్రయత్నించింది. కానీ చెయ్యలేకపోయింది.
ఈలోగా నాకు MBA Admission వచ్చింది అది నువ్వు ఇచ్చిన Training వల్లే అందుకే నీకు చాలా సార్లు రుణపడి ఉన్నాను.
ఇక పోతే నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, అర్జున్ ఎలా ఇక్కడకి వచ్చాడు, నిషా ఎప్పుడు ఇక్కడకి వచ్చింది అనేకదా నీ అనుమానం?
నువ్వు అసలు నాచేత MBA చేయించింది నీ Company లో HR post కోసం, కానీ నీతో ఉంటే నాకు నిషా నుంచీ బాధలు తప్పవు, అందునా ఇన్ని పాపాలు చేస్తున్నాము ఎప్పుడైనా దొరికిపోతాము అని భయం. అందుకు నేను వెళ్ళి పోతాను అని చెప్పాను. నిషాకి నచ్చలేదు. అందుకే నన్ను చంపించడానికి ప్రయత్నించి అది నువ్వు చేసావు అని అర్జున్ తో చెప్పింది.
అది జరిగిన కొన్ని రోజుల ముందు మీ నాన్నగారికి నీ దగ్గరనుంచీ ఒక Mail వచ్చింది. నాకు ప్రాణాపాయం ఉంది అని. అందుకే మీ నాన్నగారు Time Portal ద్వారా నన్ను ఇక్కడకి తీసుకు వచ్చారు. తరువాత నిషాని ఇక్కడకి తీసుకు వచ్చి కొంచం మంచి మాటలు చెప్పి ఇక్కడ College లో Faculty గా చేరింది, నువ్వు ఎవ్వరి ప్రాణాలు తియ్యవు, భయపెడతావు అంతే. ఎవరైనా నీకు ఎదురు తిరిగితే వాళ్లని చంపుతాను అని భయపెట్టి.
(సశేషం ..)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.