ఎవరికి ఎవరు కావాలి


ఇది ఒక మధ్యతరగతి జీవి పరిస్థితి.

ఒక చదువుకున్న అమ్మాయికి ఉద్యోగం చేసే అబ్బాయి కావాలి

ఒక వ్యాపారస్తుని కూతురికి ఉద్యోగం చేసే అబ్బాయి కావాలి.

ఒక రైతు కూతురెకీ ఉద్యోగం చేసే అబ్బాయి కావాలి.

ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎవరిని అడిగినా ఉద్యోగం చేసుకునే అబ్బాయిలు కావాలి అని అడిగేవారే, అలా కాకపోయినా మహానగరాలలో మంచి ఇల్లు వ్యాపారం ఉండాలి.

ఎక్కడ నుంచీ వస్తాయి ఉద్యోగాలు ఎక్కడనుంచీ వస్తాయి ఉద్యోగాలు ఎక్కడనుంచీ వస్తాయి మహానగరాలలో వ్యాపారాలు?

కారణం ఏమిటా అని అలోచిస్తే,

చదువుకున్న అమ్మాయికి చదువురాని లేదా వ్యాపారం అబ్బాయికి పడదు.

వ్యాపారస్తునికి తెలుసు అతను రోజుకు ౧౨ గంటలు పనిచేస్తేగానీ ఇల్లుగడవదు అందుకే వ్యాపారస్తుడు వద్దు.

రైతుకు అందరూ అతనిని మోసం చేసేవారే ఉద్యోగస్తులనైతే ఎవ్వరూ మోసం చెయ్యరు అని నమ్మకం.

ఒక్కసారి అలోచించండి, మనం ఇలాగ చెయ్యడం వల్ల లాభపడేది ఎవరు అని?

ప్రతీ ఒక్కడికీ ఉద్యోగం కావాలి అందువల్ల ఉన్న వ్యాపారాలు మాని ఉద్యోగ వేటలో పడుతున్నాము, అదే అదునుగా Super markets Hyper markets పుడుతున్నాయి. మనం తక్కువకు దొరుకుతుంది అనే అలోచిస్తున్నాముగానీ ధనం తీసుకు వెళ్ళి Local వాడికి కాకుండా వేరేవాడిని బ్రతికిస్తున్నాము.

ఇక రైతులు, మనం సాయం చెయ్యం వాళ్ళని నాయకులు దోచుకుంటున్నారు. ఇలా మనం మన ధనంతో వేరే వాళ్ళని బ్రతికిస్తున్నాము.

ఒక్క క్షణం Pub's కి వెళ్ళే ముందు / Beverages తీసుకునే ముందు ఆలోచించండి ఎంతవరకూ నీ కడుపు నిండుతుంది. ఎంతవరకూ నువ్వు ఎక్కువమందిని బ్రతికించగలుగుతున్నావు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.