ఏమిటో నా సందేహాలు - సర్లే ఎవ్వరూ సమాధానం చెప్పరు

ఇప్పుడే ఎవరో వ్రాసింది చదివాను, వారిని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు.
కానీ నిజం తెలుసుకోవాలి అని వ్రాస్తున్నాను.
రోజూ నేను నన్ను ఎన్నో ప్రశ్నలు అడుగుతాను కానీ చాలా వాటికి సమాధానం దొరకదు.

మా నాన్నగారికి నాకు మధ్య తేడా
మా నాన్నగారు ఎప్పుడు బజారుకు వెళ్ళి కూరగాయలు తేవాలి అన్నా ఒక సంచే తీసుకు వెళ్ళారు.
మరి నేను  కావాల్సిన తీసుకు రావడం సంచే గించే ఏదీ లేదు ఎందుకంటే ప్రతీ Super market లో మనం సరుకులు తెచ్చుకోవడానికి సంచే ఇస్తారు కదా.

కానీ వచ్చిన తరువాత బాధపడే వాడిని దీన్ని ఎక్కడ dispose చెయ్యాలి అని. మళ్ళీ షరా మామూలే.
  
తరువాత మా నాన్నగారు
చిన్నప్పుడు మాకు బట్టలు కుట్టించే వారు, నేను అడిగే వాడిని నాకు ready made కావాలి అని, కానీ మా నాన్నగారు ఒప్పుకునే వారు కాదు. ఇప్పుడు అర్ధం అయ్యింది దానికి రెండు కారణాలు
౧. ధర తక్కువ
౨. మన ప్రదేశంలో ఉన్న వాళ్ళు మనతో బాగుపడతారు.

ఇక పొతే మా ప్రదేశం లో కిరాణా అన్గాదిలు, నాకు చాలా మంది చెప్పే  వారు వాళ్ళు కింద చిటపాడు అతికించి తూకం తేడా వచ్చేటట్టు తరువాత అయిస్కంతం ఇలా చాలా ఉండేవి అని. కానీ నేను ఎప్పుడూ చూడలేదు.

ఇంకా చెప్పాలంటే మా ఊరులోని దగ్గరఅంగడిలో ఇప్పటికీ కాగితం recycling చేస్తారు, కాగితంతో తాయారు చేసిన సంచులలో ఉప్పు,బెల్లం,పపుదినుసులు ఇలా ఏది కుదిరితే అది.

ఏమిటి ఈ సుత్తంతా మమ్మల్ని పీక్కు తినకు అని అంటారా! ఆగండి ఆగండి మీకు అసలు విషయం చెబుదామనే ఈ రాద్దాంతం.

ఇప్పుడు super markets దగ్గరకు వద్దాం.
౧. పప్పుదినుసులు ఉండేది plastic cover లో
౨. కూరగాయలు ఉండేది AC లో అందరి చేతులో వాటిమీద పడి.
౩. సరుకులు ఇంచుమించు Expiry దగ్గరలో
౪. బియ్యం ధరలు నిర్దేశించేసారు ఇక ధరలు మారవు.
౫. పళ్ళు పండిన వెంటనే వాటిని కొనేసి తీసుకు వెళ్ళిపోతారు ఇక మనం పళ్ళు కొనుక్కోవాలి అంటే చిన్న తప్పక వెళ్ళి వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి.
౬. మనం ఇక ఉద్యోగాలు చేస్తూనే ఉండాలి నువ్వు ధనవంతుడివి అయితే తప్ప!

ఇప్పటికే ఇంధనం ధరలు పెరిగిపోతున్నాయి అని గోదావపెడుతున్నాము ఆ Super markets నడవడానికి చాలా ఇందనం కావాలి అదీ వాళ్లకు తక్కువ ధరకు ఇస్తారు, మనకి మాత్రం ఎక్కువ ధరకు.
మనల్ని ఎదురుగా పెట్టుకుని మోసం చేసే వాళ్ళు కాదు, కానీ మన వెనకాల గోతులు తవ్వుతున్నారు. ఒక్కసారి ఆలోచించు ముందు వాళ్లకి మద్దతు ఇచ్చే ముందు ఒక సారి ఆలోచించండి మీ దగ్గర డబ్బులు అయిపోయిన తరువాత మీరు ఏమి చేస్తారు?
వాళ్ళ కడుపు నిమ్దినంత కాలం మీకు తక్కువ ధరలకు దొరుకుతాయి తరువాత?
సమాధానం లేని ప్రశ్నలు.
ఇంకొన్నాళ్ళకి మళ్ళీ మనం ఉప్పు సత్యాగ్రహం చెయ్యాల్సి వస్తుంది గుర్తుంచుకోండి. మనం తయారు చెయ్యడం మరచిపోయినతరువత కొనడమే మనకి శరణ్యం.
చూసి నేర్చుకోండి America కోకులేకో  లేక పోవడానికి కారణం ఈ Super markets, Multi national retail markets. డబ్బులన్నీ ఒక్కళ్ళ దగ్గరకి చేరిపోయాకా వాళ్ళకి లాభాలు ఎక్కడనుమ్చీ వస్తాయి అందుకే మూసేస్తారు డబ్బులు పోగొట్టుకోవడం కన్నా ఇది ఉత్తమం కదా, డబ్బులు లేకపోయినా తరువాత ఏమి చేస్తావు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.