అలాగంటే ఇలాగ ఇలాగ అంటే అలాగా

ఇది తమను తాము ప్రజల అభ్యున్నతికి పాటు పడుతున్నాము అని చెప్పి అడవులలలో తుపాకులు పట్టుకుని తిరుగుతున్న  మరియు డబ్బులు అవసరమైనప్పుడు ఆ అడవులలో చెట్లు నరికి తాము చేస్తున్న దాంట్లో తప్పు లేదు అని నిరూపించు కోవడానికి ముఖానికి ముసుగు వేసుకుని జనాల్ని మోసం చేస్తున్న డబ్బా గాళ్ళకి నేను అడిగే ప్రశ్నలు

౧. యంత్రాలతో పనిచేయిస్తే యంత్రాలు ఎందుకు ఉపయోగిస్తారు అని యంత్రాలు తగల బెట్టిస్తారు, కాదు ప్రజలతో పనిచేయిస్తే అభివృద్ధి ఆలస్యం అవుతుంది అంటారు - అసలు అభివృద్ధి అంటే వేరే దేశాల నుంచీ సామాగ్రి దిగుమతి చేసుకోవడమా?
౨. తినడానికి తిండి లేదు త్రాగడానికి నీరు లేదు మొర్రో అంటుంటే, వాళ్ళకి అవి అందించకుండా ఆయుధాలు మాత్రం కొంటారు, ఇది ఎక్కడ న్యాయం.
౩. మన ఎదురుకుండా కొంత మంది అసుభ్రమైన పని చేస్తుంటే దానిని record చేసే సాధనం కొనడానికి మాత్రం డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళకి అపరిశుభ్రం  నుంచీ కాపాడే సామగ్రి మాత్రం కొనరు, మరి ఇదేవిధమైన సహాయక చర్య.
౪. వర్షాలు కురవడానికి మంచి అటవీ ప్రాంతం ఉండాలి అలాంటి అటవీ ప్రాంతం తగ్గించడానికి మనసు ఎలా ఒప్పుకుంది, పోనీ మీరు చెట్లు నరకలేదు నరుకుతున్న వాళ్ళని ఎందుకు ఆపరు?

వీటికి సమాధానాలు చెప్పండి తమని తాము అభివృద్ధికి ఆటంకాలు కాని వారు అనుకునే వాళ్ళు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.