నిద్ర

చెన్నై చేరుకున్నాను
తరువాత కొంచం సేపు "నిరీక్షణ", స్నానాల గదిలో నీళ్ళు లేవు
తరువాత కొంచం "సాయం" కోరిన వారు గుర్తుకు వస్తే, phone చేసాను రక్తం అందింది అన్నారు
తరువాత Bus ఎక్కాను కొంచం "నిర్లిప్తత" ఒక పదిహేను నిమిషాలు, మరి నేను సాయం చెయ్యకపోవడం పైవాడికి నచ్చలేదేమో ఇంకా నేను గమ్యస్థానానికి చేరుకోక ముందే call ఒక్క unit సరిపోదు నన్ను రమ్మని.
"నిర్లష్యం"తో కంగారుగా దిగాను కొంతమందికి నా Bag తగిలిందనుకుంటా(మరి ఇంటి నుంచీ వస్తున్నాను కదా)
కొంచం "సంతోషం", వెనక్కి వెళ్ళాలి, ఒక ౪ kilo meters ఉంటాది మరి Auto ల గురుంచి తెలుసుకదా
౧౦౦ అడిగాడు, తగ్గను అన్నాడు, కొంచం సేపటి తరువాత ఇంకో Auto వాడు ౯౦ అన్నాడు. చాలా సేపు "బతిమాలాను" ౬౦ కి వస్తాడేమో అని, తగ్గలేదు ఇక తప్పలేదు అనుకుని బయలు దేరాను.
Vijaya Hospital Vadapalini దగ్గరకు చేరుకున్నాను, ఏమనుకున్నడో ఎమో "మంచి" చేసే వాళ్ళ దగ్గర కూడా దొచుకోవడం అనుకున్నట్టున్నాడూ ఇంకో పది తగ్గించి ౮౦ తీసుకున్నాడు.
ఇక Blood donate చెసేసాను, అడిగిన వ్యక్తికి "పని" ఉండడం వల్ల అనుకుంటా కలవడం కుదరలేదు, నేను చేసిన సాయం వాళ్ళకు అందింది అనే అనుకుంటాను.
ఇక ఇంటికి phone చేస్తే సెలవు పెట్టు అన్నారు, ఎంతైనా నాన్నగారు కదా. "సంరక్షణ" ఆయన కర్తవ్యం కదా అలాగే అంటారు, అందునా నేను ఉండే ప్రదేశానికి blood donate చేసిన ప్రదేశానికి చాలా దూరం, అదే కాకుండా నేను "సుకుమారుడను" (చిన్నప్పటి నుంచీ కుట్లు పడే దెబ్బలే తప్ప తిట్లు పడే దెబ్బలు తగుల్చుకోలేదు - కుట్లు పడే దెబ్బలు అందరికీ బాధే కానీ అవి మనల్ని ఇంకా సున్నితంగా మారేలా చేస్తాయి), అమ్మకు చెబితే పాలు పళ్ళు మాత్రమే కాకుండా పళ్ళ రసాలు తీసుకోఅంది("అమ్మ ఆకలి చూస్తుంది" - నాకింకా పెళ్ళి కాలేదు పెళ్ళం గురించి మాట్లాడటానికి అర్హుడను కాదు)
ఇంకా మధ్యమధ్యలో కొంచం "కోపం" కొంచం "అసహనం" కూడా నిండుకున్నాయి. అవి మరి ఎక్కడ ఎప్పుడు వ్రాస్తానో?

మరి మీకు కూడా గుర్తుండాలి కదా నేను రక్తదానం చేసిన రోజు - ౦౨-౦౭-౨౦౧౨