తరువాత

అప్పుడప్పుడు నేను చేసాను కాదు చాలా సార్లు చేసాను, చేసిన ప్రతీ మారు తప్పించుకోవడానికి చేస్తాను అనడమే.
అదే ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న.
నిన్న నేను blood  donate  చేసాను అని చెప్పాను కదా, అప్పుడు కొందరు అడిగిన ప్రశ్న "అన్ని మార్లు ఎందుకు రక్తం దానం చేస్తున్నావు అని".
కానీ నన్ను కొందరు నువ్వు ప్రత్యేకం అంటారు అలాగే నా రక్తం కూడా AB RH లేదు (AB-) నువ్వు కాకపొతే నీ తరువాత వాళ్ళు, అభ్యర్ధించిన వాళ్ళు ఇస్తారు కదా. నిజమే నా దగ్గరకు వచ్చింది అంటే నేనే కదా ఆ తరువాత వాడిని.
మరి అడిగిన వాళ్ళకి ఇది తెలియదా అని మీరు అడగవచ్చు తెలుసు కానీ వాళ్ళకి నువ్వు ఒక్కడివే ఉంటున్నావు, నీకు నీరసం వస్తే నిన్ను చూడడం కష్టం అని అంటారు(అది నిజమే కదా), కానీ ఆ దేవుడే నా చేత చేయించాడు అంటే ఆయనికి తెలుసు  నాకు కావలసినంత శక్తి ఉంది అని.
కానీ తరువాత అన్నది ఉండకూడదు అని చెబుదాము అనుకుంటాను చెప్పలేను నా ఉక్రోషం నా విస్మయత్వాని ఆపేస్తుంది , అందుకే ఇది వ్రాస్తున్నాను.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.