నేను చెడ్డ వాడినా?

అవునేమో అందుకే ఈ రుసుములు
నేను Petrol వాడట్లేదు అందుకు నేను ఆ సొమ్ము మీద పన్ను చెల్లించాలి
నేను విదేశీ వస్త్రాలు ధరించడం మానేసాను - అందుకు నన్ను హిందుత్వ వాది అని దూషిస్తున్నారు అసలు భారతీయత అంటే తెలియని వాళ్ళు
చదువు చెప్పే బడిపంతులు తక్కువ ఉత్తీర్ణత వచ్చిన వారిని బెత్తంతో కొట్టాడు వాడిని పొరపాటున సమర్ధిస్తే - నీకు మానవత్వం లేదు అని ఈసడించుకునే వాళ్ళు - పిల్లలని యాంత్రికంగా మార్చి నరకయాతనకు గురిచేసి, వాళ్ళ చేత Olympics లో బంగారు పతకాలు సంపాదించేలా చేసిన దేశానికి మాత్రం దాసోహం అంటారు.
పారిశ్రామికీకరణ ఇక చాలు అంటే - నన్ను తిట్టుకునే సాంబారు గాళ్ళు
అడవులలో వృక్షాలు నరకడం ఆపండి అంటే - మా ఇంటి శోభను తగ్గిస్తావా అని నన్ను చాలా మంది ఈసడించుకుంటున్నారు.
నాకు Bike నడపడం రాదు అంటే నవ్వి అవహేళన చేసే వాళ్ళు.
 భూములు సాగుకోసం ఉపయోగించండి - ఇళ్ళు కట్టుకోవడం మానేసి ఉమ్మడి కుటుంబంలో ఉండండి అంటే - నా దగ్గర డబ్బు ఉంది నువ్వెవడివి అని ఆక్షేపించే వాళ్ళు.
నేను  ఇన్ని రకాలుగా చెడ్డ వాడిని.
ఇకపోతే నేను హిందుత్వ వాదిని - ఎందుకంటే హిందుత్వం అనేది మతం కాదు కాబట్టి.
నేను దైవ భక్తుడను - ఎందుకంటే నేను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతాను.(ఇది మీరు Newtons Third law of Motion అని కూడా అన వచ్చు)