పండుగలు - ఎలా చేసుకోవాలి - ఎందుకు చేసుకుంటున్నాము?

ఉగాదిషడ్రుచుల జీవితాన్ని తెలిపే ఉగాది పచ్చడి తినడంనీ గమ్యంలో ఆటుపోట్లు ఉంటాయి గెలుపోటములు ఉంటాయి అన్నిటినీ జీర్ణం చేసుకో(అంటే వాటిని అలవాటు చేసుకో) అని చెప్పడం
హోళీఒకరిమీద ఒకరు రంగు వేసుకోవడంనాకు అసలు కధ తెలియదు, దీని గురించి చాలా ప్రదేశాలలో చాలా కధలు విన్నాను కానీ ఒక నారిసింహ అవతారం ప్రకారం హోళికా అనే రాక్షసి ప్రహ్లాదుడుని సంహరించడానికి తన ఒళ్ళో కూర్చో పెట్టుకుంటుంది. తరువాత తన శరీరం మీద మంటల నుంచీ కాపాడే వస్త్రం ధరించింది. చితికి నిప్పు పెట్టగానే భీకరమైన దుమ్ము ఎగిరి ఆ వస్త్రం ప్రహ్లాదుడి శరీరాన్ని కప్పి అతనిని కాపాడి హోళికా దహనం అయ్యేటట్టు చేసింది. దీన్ని బట్టి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి

౧. దైవం తలిచిన దాన్ని మార్చలేము

౨. ఒక్కోసారి నువ్వు ఎంత కష్టపడి గోడ కట్టుకున్నా ప్రకృతి వైపరిత్యం నుంచీ కాపాడుకోలేవు

౩. నీలోని చెడును దహనం చెయ్యడాన్నికి ఎదుటివారి సాయం నీకు ఒక్కోసారి అవసరం, అది నీ మీద నీళ్ళు జల్లి స్ప్రుహలోకి తీసుకు రావడానికి, ఇక దుమ్ము నువ్వు చేసే చెడ్డ పని నుంచీ నిన్ను నిలువరించడాని
శ్రీరామ నవమిపానకం సేవించడంసాధారణంగా వర్షాకాలంలో అజీర్తి చేస్తుంది, పానకం మనల్ని దాని నుంచీ కాపాడుతుంది
రక్షా బంధనంచెల్లెళ్ళు అన్నలకు బంధనం కడతారుఅన్నయ్యను వాళ్ళు ఎప్పుడూ కోరుకునేది ఒక్కటే మాకు రక్షగా ఉండు అని, దానికి సూచనగా మాత్రమే రక్షా బంధనం చేస్తారు
వినాయక చవితివినాయకుడిని పూజించడంఆయన విఘ్నాధిపతి - మనకు విఘ్నాలు కలగకుండా కాపాడ మని ఆయన్ వివేకి అదే వివేకము బుద్ది మనకు ప్రసాదించమని మనం కోరుకుంటాము మరి అన్ని పండ్లు ఎందుకు కడతాము అంటే ఈ కాలంలో పండ్లు ఎక్కువగా దొరుకుతాయి వాటిని భుజించి మీ శరీరానికి అవసరమైన పోషక విలూవలు నింపుకోండి అని
దసరాఈ నవరాత్రులూ ఒక్కో దేవికీ పూజచేసి వడ్లు పంచి పెట్టి దశమి నాడు మంచి కార్యం మొదలు పెట్టండం రివాజుమనం ఏదైనా పని మొదలు పెట్టడానికి పూర్తి చెయ్యడానికి అవసరం ఆ శక్తులు కలవారు అని చెప్పడానికి మరి వడ్లు ఎందుకు పంచి పెడతారు అంటే ఆ శక్తులు ఉన్నా ముఖ్యమైన శక్తి మనిషిని నడిపించడానికి ఆహారం ముఖ్యం కదా మరి
దీపావళిటపాసులు కాల్చడంకధ అందరికీ తెలిసిందే ఇకపొతే టపాసులు కాల్చడం వల్ల నష్టాలు అనేవారు చాలా మందే ఉన్నారు, నాకు తెలిసి ఇది వరుకు రోజులలో క్రిములు చంపడానికి ఈ ప్రక్రియేమో ఎందుకంటే - ఒక్కొక్కరూ ఒక్కోరోజు కాలుస్తూ ఉంటే ఒకరి ఇంటి దగ్గర నుంచీ ఇంకొకరి ఇంటి వరకూ వెళతాయి అదే అందరూ ఒకేరోజు చేస్తే అన్ని క్రిములూ నసిస్తాయి అని అనుకుంటున్నాను.
యమ విదియసోదరి గృహానికి వెళ్ళి సోదరి చేతివంట తిని ఆరోజు తిరిగి వచ్చేరోజుకధ ఆ లంకెలో ఉంది, ఇక విషయానికి వస్తే ఇదివరుకు రోజులలో దసరా దీపావళి పూర్తికాగానే పంటలు డబ్బులు చేతికి వచ్చేవి కొంత సమయం వారి వారితో వెచ్చించడానికి సమయం దొరికేది, మరి చెల్లెలు చెల్లెలే కదా క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి ఈ రోజు వెళ్ళి వచ్చేవారు
కార్తీక మాసంఉపవాసాలుఆ కాలాల్లో వాళ్ళకి ఇప్పుడు ఉన్నట్టు మందులు అంతగా దొరికేవి కాదు, ఈ మాసంలో అధికంగా క్రిములు పెరిగేవి అందుకే ఆ మాసంలో ఉపవాసాలు ఉండేవారు
సంక్రాంతిమూడు రోజులు
- మొదటి రోజు - భోగి పాత వస్తువుల దహనం
రెండవ రోజు - సంక్రాంతి - వడ్లు బియ్యం దానం ఇచ్చేరోజు
మూడవ రోజు - కనుమ - శక్తికి పూజలు జరిపేరోజు
మొదటిది పాత వస్తువులు పాడైపోయిన వస్తువులు దాచిపెట్టుకుని ఏమీ చెయ్యలేము అందుకే దగ్ధం చేస్తున్నాము రెండు - నిజానికి దానం చెయ్యట్లేదు బియ్యం మీద ఎవరి పేరు వ్రాసి ఉందో వాళ్ళకు ఇస్తున్నాము ఇక మూడవ రోజు ఆ తల్లి ఇచ్చిన శక్తి వల్ల మనం సాధించాం అలాగే శక్తిని ప్రసాదించు అని కోరుకోవడానికి
మరి ఇప్పుడు పండగ అంటేతాగి తందనాలు ఆడటంలాభ పడుతున్నది ఎవరు? అని ఆలోచించం ఇది వరకు వాడు భోగాలకు అలవాటు పడితే వేలు ఎత్తి చూపించే వాళ్ళం మరి ఇప్పుడు అదే మనం చేస్తే తప్పు కాదా అని కూడా అలోచించని స్థాయికి చేరుకున్నం

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.