సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా?

దాతకానివాని దరచుగా వేడిన
వాడు దాత యౌనె వసుధలోన
అవురు దర్భయౌనె యబ్ధిలోముంచిన
విశ్వధాభిరామ వినురవేమ.

దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా?వాడు దాత అవుతాడా?ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా?

వాళ్ళ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిధ్ధంగా లేని వారు ఇక్కడ ఎలా పెడతారు?
వాళ్ళ దేశం సంక్షోభంలో ఉంటే ఇక్కడ పెట్టుబడులు పెడతారా?

ఇది నాకు FDI ల మీద కలుగుతున్న అనుమానం. వేమన పధ్యంలో తెలిపిన విధంగా వాళ్ళు మారరు. మరి ఎవరు ఆ ౫౧ శాతం పెట్టుబడులు పెట్టే శక్తి ఉన్నవాళ్ళు అంటే ఇక్కడ మన సంస్థానంలో సభ్యులు.
ఎందుకంటారా, Swiss banks లో దాస్తే పన్ను నుంచీ తప్పించుకోగలుగుతున్నారు కానీ దాని మీద వస్తున్న లబ్ధి తక్కువ, అందుకే ఈ FDI నాటకం అనుకుంటున్నాను.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.