వంపుకఱ్ఱ గాల్చి వంపు దీర్చగవచ్చు

వంపుకఱ్ఱ గాల్చి వంపు దీర్చగవచ్చు
గొండలన్ని పిండి గొట్టవచ్చు
గఠినచిత్తు మనసు కరిగింపరాదు
విశ్వదాభిరామ వినురవేమ.

కాల్చి వంకరగా ఉన్న కర్రను సరి చెయవచ్చు, కొండలని పిండి చెయ్యవచ్చు కానీ కఠిన హృదయుడుని మనసు కరిగించలేము.

మరి ఈ రాజకీయనాయకులను ఏమి చెయ్యాలి?
మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే

నీటిలోని వ్రాత నిలువక యున్నట్లు
పాటిజగతిలేదు పరములేదు
మాటిమాటికెల్ల మారును మూర్ఖుండు
విశ్వదాభిరామ వినురవేమ.


నీటిమీద వ్రాసిన వ్రాత ఎందుకునూ కొరగాదు.ఉపయోగము లేనిది.అలాగే మూర్ఖుని స్వభావము మాటి మాటికి మారుతూ ఉండును.అనగా మంచి,చెడ్డలు ఆలోచింపరని భావము.

ఎప్పటికైనా వాడీ మూర్ఖత్వం వాడికి తెలుస్తుంది.

1 comment:

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.