తేలుకొండిఁగొట్టఁదే లేమి చేయురా

చంపగూడదెట్టి జంతువైనను
చంపవలయు లోక శత్రుగుణము
తేలుకొండిఁగొట్టఁదే లేమి చేయురా
విశ్వదాభిరామ వినురవేమ.

చెడును నాశనము చెయ్యాలంటే దానిని అంతమొందించటం ఒకటే మార్గము కాదు.తేలు క్రూర జంతువని దానిని నాశనము చేయకుండా దాని కొండినితీసివేస్తే దాని వలన ఎటువంటి ప్రమాదము వుండదు.అలాగే లోకములో ఉన్న హింసాప్రవృత్తిని చంపవలెను.అందుకు మన చెడుబుద్దిని విడువవలెను.
ఇది తమని తాము Marxist అనుకునే వాళ్ళకు ముఖ్యంగా. ఏది చెడో ఏది మంచో తెలియక శతమవుతున్న అమాయకులు. నా Blog లో నా ప్రయత్నం చెడును నిర్మూలించడం తప్ప ఇంక వేరే ఏమీలేదు.