నిజానికి మనకి ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందా?

అరయ నాస్తియనక యడ్డుమాటాడక
తట్టుపడక మదిని దన్నుకొనక
తనది గాదనుకొని తాబెట్టునదె పెట్టు
విశ్వదాభిరామ వినురవేమ.

యాచకుడు తనను అడగవచ్చినప్పుడు లేదనకుండా,తొట్రుపాటు లేకుండా,ఇవ్వనా?వద్దా అని మనసులో అలోచించక ఇచ్చే వస్తువు మీద మమకారము విడిచి దానము చేసినచో ఆ దానము కోటిరెట్లు ఫలమునిచ్చును.

ప్రభుత్వంజెప్పింది ౨ లక్షల ఆర్ధిక సహాయం మేము మీకు Diesel రూపంలో చేస్తున్నాము అని. నిజానికి గతకొంతకాలంగా జరుగుతున్నది
౧. నల్ల ధనం విదేశాలకు తరలిపోవడం వల్ల Dollar ధర పెరిగింది - దాన్ని ఆపలేకపోయారు
౨. నాకు గుర్తెరిగి మా ఇళ్ళలో అప్పుడప్పుడు కొబ్బరిచెక్కలు లేదా పాత వస్తువులు నీళ్ళు కాయడానికి ఉపయోగించే వాళ్ళము, కానీ ఇప్పుడు Boilers అసలు అమ్మకానికేలేవు ఎందుకంటే ఇనుము ఉక్కు మరియు లోహాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అదే కాకుండా ఆ వృత్తి ప్రజలను అణగదొక్కేసారు.
౩. ఇకపోతే అసలు ఏమీ ఆశించకుండా ఎవరు వస్తారు? రైతులకు అధిక ధర వస్తుంది తరువాత ద్రవ్యోల్పణ సూచీ పెరుగుతుంది, ఎందుకంటే బియ్యం నిల్వ చేసుకుని అమ్మవచ్చు అలాగే మనదేశంలో అన్ని తృణ ధాన్యాలు కూడా. తెలకపల్లి రవి తెలిపినట్టు అమెరికాలో ౨౦౧౦లో బియ్యంధరలు ౩ రెట్లు పెరగడానికి కారణం అప్పటికాలంలో Walmart చేసిన బియ్యం సేకరణ - ఇది ఇక్కడ వాళ్ళు కూడాచేస్తున్నారు మొదట వాళ్ళని ఆపండి Manmohan ధరలు వాటికవే తగ్గుతాయి.
౪. ఒకవేళ నిజంగా మీరు చెబుతున్నది నిజమైతే America లో అంతపెద్ద ఎత్తున ప్రజాగ్రహానికి ఎందుకు గురయ్యాయి Manmohan singh?

ముందు మీరు చేస్తున్న తప్పులను ఆపండి తరువాత వీటిగురించి మాట్లాడుకుందాము.

ఏ రీతిన మీరు రద్దీ ఎక్కువ Roads లో అనుమతించారు?
ఏ రీతిన మీరు ౩౦ రూపాయలు విలువచేసే పనిని ౩౦౦ రూపాయలకు కట్టబెడుతున్నారు(Contracts in constructions etc.)
మీరు స్థలం ధరలు పెరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నారు?
పంటలు పండే పొలాలు ఇళ్ళస్థలాలుగా మార్చకుండా ఎందుకు ఆపలేకపోతున్నారు?
అసలు అవసరం లేని చోట అంటే వ్యవసాయం జరిగేచోట ఉపాధిహామీ పధకాలు ఎందుకు- దీని ఒక్కదానికి మాత్రం నాకు తెలిసినది చెబుతాను, ఎందుకంటే ఒకవేళ పంటచేతికి రాకపోతే ప్రభుత్వం వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. అదే అసలు పంటలే వెయ్యకపొతే బోళ్ళని లాభాలు
మొదటగా అసలు పంట నష్టం ప్రభుత్వం భరిచనక్కర్లేదు రెండు రైతులు వాళ్ళ పొలాలు అమ్మడం మొదలుపెడతారు దానితో ప్రభుత్వానికి కావలిసినంత డబ్బు. ఇక మూడు ఉపాది పొందినవాడు మీకు తరువాత ఎన్నికలలో బానిసవుతాడు(ఇది ఇప్పటికే YSR బానిసత్వం రూపేణా కనిపిస్తుంది, ఎలాగూ గాంధీ(fake) బానిసలు ఉండనే ఉన్నారు)

ఇప్పటికీ అర్ధంకాని చాలా విషయాలు
BEL స్థాపించి ఇన్ని సంవత్సరాలు అయ్యింది స్వతహాగా అక్కడ వారిచేత తయారైన వస్తువు అసలు కానరాదు, అన్నీ sub-contractual.
ఇక BHEL == Assembly unit.
ఇలాంటివి కోకొల్లలు, లాభాలు సంపాదించేవి చాలా ఉన్నాయి కానీ వాటి లాభాలు ధనవంతులకు ఉపయోగపడుతున్నాయి.

అసలు Stock market అంటేనే పెద్ద కుంభకోణం ప్రభుత్వం ప్రజలకోసం పనిచేస్తున్నప్పుడు సూచీలు కిందకి అదే పరిశ్రమలకోసం పనిచేస్తున్నప్పుడు పైకి, అసలు అది Investment కానేకాదు, అక్కడలాభపడుతున్నది బడా Sales persons. అన్నిటికన్నా అది ఒక వ్యసనం, ఆ డబ్బులుకు వచ్చిన కాగితాల విలువేంత?

ముందు ఇక్కడ ధనం ముడిసామాగ్రి మయమైపోకుండా ఆపు చాలు. అన్నట్టు అడగడం మరిచాను Manmohan Singh తలపాగా తీయమని American security వాళ్ళు అడగలేదా?