డబ్బులు చెట్టులకు కాయవు...

చిప్పబడ్డ స్వాతిచినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటగలిసె
బ్రాప్తికలుగుచోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ.


స్వాతికార్తెలో కురిసేటువంటి వాన చినుకు చిప్పలో పడినచో ముత్యము అగును. అదే నీటిలో పడినచో నీటిలో కలిసిపోవును.ఆ విధంగానే మనకు రాజాశ్రయము దొరికిన మన బ్రతుకు ముత్యమువలె మెరిసిపోవును.లేకపోతే మనము కూడా నీటిలో కలిసిపోయిన వాన చినుకు వలె అయిపోతాము.

వేమన వల్లించిన ఈ పధ్యం మన Manmohan Singh గారికి తెలియజెబితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన కూడా నేటి యువతలా Artificial rituals వల్ల దేశం శుభిక్షంగా ఉంటుంది అనుకుంటున్నారు.

స్వాతికార్తెలో కురిసేవాన మాత్రమే ముత్యానికి బీజం అవుతుంది, మిగిలినవి కావు. కానీ నేటి Science వల్ల అసలు ముత్యాలు వాటి అస్థిత్వం కోల్పోయాయి.

ఇక ఆయన అన్నట్లు చెట్లకు డబ్బులు కాయవు, కానీ చెట్ల నుంచీ వచ్చే Oxygen నుంచే జీవనం జీవితం నడుస్తుంది. అది ఈ గతఆర్ధిక అమాత్యులకు తెలియదా?
నిజమే చెట్ల నుంచీ డబ్బులు రాలవు, కానీ చెట్లు
౧. ప్రాణవాయువు ఇస్తాయి
౨. నీడను ఇస్తాయి
౩. ఆహారం ఇస్తాయి
౪. వర్షాలు కురవడానికి ఆస్కారం కలిపిస్తాయి.

ఇవేకాకుండా చెట్లు నుంచీ Manmohan చెబుతున్న డబ్బు తయారు చేస్తారు.
మరి FDI లు వస్తే జరిగేది
మొదటిది డబ్బులు ఇవ్వని చెట్లు నరికేస్తారు పర్యావసనంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది మళ్ళీ మనం అక్కడ అడవి అంతర్ధానం అయిపోయింది లేదా పులులు మనుషుల మీద దాడి చేస్తున్నాయి అని అరుస్తాము.
ఇకపోతే అక్కడికి వెళ్ళడానికి దారులు ఎప్పటికీ రద్దీగానే ఉంటాయి, కొనుగోలు తగ్గుతుంది దాని వల్ల ఆ సంస్థలకు నష్టాలు పర్యావసనంగా ఆ సంస్థలు అక్కడ నుంచీ తీసెస్తాయి, తరువాత ఆ స్థలం ఖాళీ క్షమించాలి గోడలు వెలవెలబోతాయి, చెట్లు వెయ్యగలమా లేదు. మరి ఏమవుతుంది?

అసలు ప్రభుత్వం చిల్లర వర్తకంలో ఎందుకు రప్పించాలి అనుకుంటుంది?
కారణాలు అనేకం నాకు తెలిసినవి చెబుతాను
సంవత్సరానికి జరిగిన వ్యాపార విలువ ౭ లక్షలు దాటకపోతే పన్ను చెల్లించనక్కర్లేదు. మరి దాని వల్ల ప్రభుత్వానికి చాలా పన్ను రావట్లేదు ఎందుకంటే ౫ కోట్ల కుటుంబాలకు సంవత్సరానికి జరిగే వ్యాపార విలువ రమారమి ౭ లక్షల కన్నా తక్కువే, అదే కనుక ఒకేచోట జరిగితే ఇంకేముంది ప్రభుత్వానికి పన్నే పన్ను దాంతో తమ జేబు సంస్థలకు కావల్సినంత నిధులు.
ఎలాగూ WalMart లంచం ఇవ్వడంలో ఆరితేరిన సంస్థ ఇక లంచాలకు అంతేముంటుంది.

America UK లో Walmart వల్ల ప్రజలు నష్టపోయారు అని తెలుసుకుని అక్కడకు వాటిని రానివ్వడం లేదు అలాంటిది మరి మనదేశంలో మాత్రం ఎలా కుదురుతుంది.

డబ్బులు చెట్లకు కాయవు కానీ అవి లేకపోతే మనకు రక్షణలేదు ప్రజలకు ఆధారం లేదు.
(వృక్షోరక్షితి రక్షితః)