ఇది నా గురించికూడా అనుకుంటున్నా
"తప్పులెన్నువారు తండోప తండంబు
లుర్విజనులకెల్ల నుండు దప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ."
లోకములోని ఆచారము ఏమిటంటే ప్రతివారు ఎదుటి వ్యక్తిలో ఈ దోషముంది ఆ దోషముంది అని ఎంచుతారు.కానీ తమలోని తప్పులను మాత్రం తెలుసుకోలేరు,గ్రహించలేరు,గుర్తించలేరు.
ఇది ఇప్పుడు జరుగుతున్న తంతు, ఒక గుంపులో ఒక వ్యక్తి తప్పు చేస్తాడు ఆ గుంపు అధికారంలో ఉన్న గుంపుకి వ్యతిరేక గణం, ఇంకంతే మీకు దీని గురించి అడిగే అర్హతలేదు, మరి అనేది ఆ వ్యక్తిని కాదు ఏకంగా ఆ గుంపునే..........
ఇక్కడ ఇంకో గమనించవలిసిన విషయం తాము చేసినది తప్పు కాదు అంటుంటూనే ఎదుటవారు అదే చేస్తే తప్పు అనడం.
ఇది రాజాకీయనాయకులే కాదు మనం కూడా అప్పుడప్పుడు
చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వర్షంలో ఆడుకునేటప్పుడు ఒకడు వర్షంలో కొంచంసేపు ఆడుకుని గొడుకు క్రిందకో లేకపోతే ఒక Bus stop క్రిందకో వచ్చి ఒక పెద్దవాడిని పిలిచి వాడు వర్షంలో తడుస్తున్నాడు తడవద్దు అని చెప్పండి అంటాడు, ఆయన ఇలా ఇక్కడికి రా అని ఆ పిల్లవాడిని అంటే ఆ పిల్లవాడు మొదట గొడుగు క్రిందకి వెళ్ళిన పిల్లవాడిని చూపించి వాడు తడిసాడు తప్పులేదు కానీ నేను తడిస్తే తప్పా? మరి ఎవరిది తప్పు? ఇద్దరూ తప్పు చేసారు అలాగని అడిగే హక్కు లేదా అర్ధం కాదు. అలాగని నేను మొదట గొడుగు క్రిందకి వెళ్ళిన వాడు చేసీంది ఒప్పు అనట్లేదు.
అన్నిదానములను నన్న దానమే గొప్ప
కన్నతల్లికంటె ఘనములేదు
ఎన్నగురునికన్న నెక్కుడు లేడయా
విశ్వదాభిరామ వినురవేమ.
అన్నింటికంటే ఘనమైనది అన్నదానము.ఎన్ని దానములు చేసిన అసంతృప్తితో ఉన్నవారు అన్నము దానము చేయుటతోనే సంతుష్టులు అవుతారు.కన్నతల్లి కంటే లోకములో ఉత్తమమైనది, ఉన్నతమైనది మరేమీ లేదు.జ్ఞానము ప్రసాదించు గురువు కంటే మించినవారు ఎవరూ లేరు.ఇవి నిత్య సత్యాలు.
ఈ రోజు ఒక మంచి వేమన శతకం పంచుకున్నాను కాబట్టి వేమన University గురించి మాట్లాడుకుందాము, పేరు వేమన కానీ అందులో ఉధ్యోగులు వేమన చెడ్డవాడిగా ఉన్నప్పటి కాలంలో వాళ్ళలా పనిచేస్తున్నారు, వేమన మారినట్టు వీళ్ళు మారతారా అంటే మారరు ఎందుకంటే వేమన వివేకం ఉన్నవ్యక్తి వీళ్ళు డబ్బు మాత్రమే వివేకం అనుకునే వాళ్ళు(నాకు వేమన గురించి మాట్లాడే అర్హత ఉందో లేదో తెలియదు). కనీసం ప్రజలందరికీ తెలిసిన వేమనలా University ఉంటే చాలు అంటే నగ్నంగా అని కాదు నలుగురికీ మంచి చెప్పి ఆదర్శంగా నిలవగలిగేలా..........
ఇది ఒక్క వేమన university గురించేకాదు అన్ని కళాసాలల గురించీ.
వేమన శతకాలు

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.