సత్య మాడువాని స్వామి యెఱుగు(మరో ఉప్పు సత్యాగ్రహానికి తయారవ్వాలేమో!)


కల్లలాడువాని గ్రామకర్త యెఱుగు
సత్య మాడువాని స్వామి యెఱుగు
బెద్దతిండిపోతుఁ బెండ్లామెఱుంగురా
విశ్వదాభిరామ వినురవేమ.

అసత్యము చెప్పే వాడిని గ్రామపెద్ద గ్రహించి అతనితో ప్రవర్తించవలసిన విధముగా వ్యవహరిస్తాడు.నిజము ఎవరు పలుకుతున్నారో సర్వాంతర్యామి అయిన భగవంతునికి తెలుసు.అందుకే భక్తులు కోరే కోర్కెలను భగవంతుడు తీర్చుతాడు.తిండిపోతు భర్తను భార్య గ్రహించును.అందుకే అతడికి సరిపడు ఆహారమును ఇస్తుంది.

అదేమిటో వేమనగారికి కూడా పరమాత్మ ఉన్నాడు అని నమ్మకం ఉందా?
ఇప్పుడు చర్చ అది కాదు. అసలు ఎవడు నిజం చెబుతున్నాడు ఎవడు అబధ్ధం చెబుతున్నాడు అర్ధం కావట్లేదు. ఒకడికేమో ధన దాహం ఇంకొకడికి Marxist followers అనే నమ్మకం.
ఇద్దరికీ పెద్ద తేడా కనిపించట్లేదు. సరే ఇప్పుడు ప్రక్షాళన కావిద్దం అనిపిస్తుంది కానీ కొత్తగా వచ్చేవాడు ఇప్పుడు ఉన్న వాళ్ళలాగా ఉంటాడా అంటే తెలియదు. దానికి పెద్ద ఉదాహరణ చైనా ఈ గడిచిన కొన్ని సంవత్సరాలలో పేద ధనిక వ్యత్యాసం తారా స్థాయికి చేరుకుంది, డబ్బులేక మునుపు యుధ్ధం చేసిన వ్యక్తులు ఇప్పుడు అదే యుధ్ధం యొక్క శత్రు పక్షంలో ఉన్నారు.

ఇకపోతే మన దేశ చరిత్ర తిరగవేస్తే చాలా కాలం క్రితం ప్రతీ మండలంలో కొన్ని ప్రదేశాలలో అన్నదానసత్రాలు ఉండేవి మరి అవి ఇప్పుడు ఏమయ్యాయి. వాటిని మూయించి వాళ్ళ వాళ్ళను గొప్పవాళ్ళుగా చూపించుకునే ప్రయత్నం ఇప్పుడు దేశంలో బాగా పెరిగిపోయింది.
దేవుడు కనుక కనిపిస్తే సత్యం చెప్పే మంచిపనులు చేసి ఇంకొకరితో చేయించగలిగిన వ్యక్తిని(నాలాంటి వాళ్ళ చేత కూడా మంచి పని చేయించాలి) పరిచయం చెయ్యమని కోరుకుంటున్నాను.