అసలు ఇళ్ళ స్థలాలకు ధరలు ఎందుకు పెరుగుతాయి?

ఇది చాలా బాధాకరమైన విషయం, ధరలు పెరుగుదల ఎలా మొదలయ్యింది.
మన దేశంలోని తెలివైన వాళ్ళు ఉద్యోగాల కోసం అని వేరే దేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించారు, వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు, ఇక్కడ ఖాళీ చేస్తున్న వాళ్ళ ఇళ్ళ స్థలాలు పొలాలు కొనేసారు. తరువాత ఈ తెలివైన వాళ్ళకు అక్కడ వచ్చిన డబ్బులు ఏమి చెయ్యాలో తెలియక ఇక్కడ ఇంకా తెలివైన వాళ్ళ దగ్గర మళ్ళీ కొనడం మొదలు పెట్టారు అంతే  ధరలు పెరగడం మళ్ళీ మొదలయ్యాయి.
ఈ ధరల పెంపు వల్ల పంట పొలాలు ఇళ్ళ స్థలాలుగా మర్చి అమ్మడం మొదలు పెట్టారు ఈ తెలివైన వాళ్ళు. ఇంకా చెత్త విషయం ఏమిటంటే ఉండేది ఇద్దరు వాళ్ళకు చాలా గదులు ఉన్న ఇల్లు. ఒక్క చోట కాదు అద్దెకు ఇవ్వడానికి 3 సొంతానికి ఒకటి.
ఇదివరకు రోజులలో పంట పొలాలన్నీ ఇప్పుడు కనిపించకుండా పోతున్నాయి.
చదువుకుని ఏమి సాధించారు అంటే తినే తిండి వాళ్ళ ఎంత నష్టాలు ఉన్నాయి లేదా ప్రక్రుతి ఎలా పడిపోతుంది కాదు దాని నుంచీ ఎంత మన శరీరానికి ఎంత పోషక విలువలు వస్తాయి అనే వాటిని గమనించడమే, ఇది కూడా ఆసరాగా తీసుకుని ఇంకా పంట పొలాలు నాశనం చేస్తున్నారు.
SEZ లు పేరుతొ పంట పొలాలు రొయ్యల చెరువులుగా మారుస్తున్నారు ఇలా చెయ్యడం చట్ట రిత్యనేరం కూడా. అయినా అంతే.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.