నీజానికి స్వామీజీలు మంచివాళ్ళా చెడ్డవాళ్ళ

నాకైతే తెలియదు
కానీ అబద్దాలు చెప్పే వాళ్లకు, తమ ఆధిపత్యం చెడిపోతుంది అనుకునే వాళ్లకు మరియు ఇళ్ళు కట్టుకునే వారికి మాత్రం చెడ్డ వాళ్ళు.
ఎలాగంటే, ఉదాహరణకు ఒక చట్టం ఉంది ఉప్పుడు దాన్ని తోక్కేసారు అదేమంటే ఒక వ్యక్తి దగ్గర 100 ఎకరాలకు పైగా స్థలం ఉండకూడదు అని, సంస్థలకు ఇందులో మినహాయింపు ఉంది అని.
మంచిదే బాగుంది, కానీ అదే ఆశ్రమం అయితే అది ఒక ఊరే అయిపోతుంది మరి అంత పెద్ద ఊరు ఏమి చేస్తున్నారు స్వామీజీలు చెట్లు పెంచుతున్నారు(నేను ఇక్కడ చెబుతున్నాది - Tiruvannaamalai(అరుణాచలం) ఉన్న పీఠం - నేను దాదాపు 10 సంవత్సరాల తరువాత అక్కడ నెమళ్ళు చూసాను, దాదాపు ఒక ఊరు మొత్తం అరుణాచలేస్వరుని కోసం మాత్రమే) దాంతో ఏమవుతుంది ప్రజలకు బహుళ అంతస్తుల భవనాలు కట్టుకోవడం కుదరట్లేదు. అందుకు కొంత మంది జనాలకు అబద్దపు ప్రచారం చేసి వాళ్ళ వల్ల మీరు ఇళ్ళు కోల్పోయారు అని దాదాపు 200 సంవత్సరాల క్రితం బీజం నాటారు అది ఇప్పుడు ఒక వట వృక్షం లా మారి(కొంత మంది స్వామీజీలు అలాగే తగలడ్డారు) అందరినీ చెడ్డ వాళ్ళు అని చెప్పడం మొదలు పెట్టారు.
ఆ బీజం పడ్డ రోజునుంచే మనం మన తల నుంచీ అరికాలు వరకు నరుక్కోవడం మొదలు పెట్టాము.
ఎలాగంటే
1. చెట్లు దేవతలు కాదు - అంటే చెట్లు నరికినా ఏమీ కాదు అని కొంత మంది చెట్లు నరకడం మొదలు పెట్టారు, అంతే అడవులు నశించడం మొదలయ్యాయి.
2. స్వామీజీలు చెడ్డ వాళ్ళు - ఇప్పుడు వాళ్ళు మంచి చెప్పినా వినే స్థితిలో లేరు, పైగా వాళ్ళు బృందంగా ఏర్పడి పెంచిన చెట్లు కూడా నరికేసి ఇల్లు కడుతున్నారు. ఈ రెంటి వల్ల నష్ట పోయింది ఎవరు మనమే మనం విడుదల చేసే విష వాయువును ప్రాణ వాయువుగా మార్చే దేవతను నరుక్కున్నాం కదా.
3. అసలు స్వామీజీలు ఏ  పని చెయ్యరు - ఈ ప్రచారం చేయించడానికి కారణం బానిసత్వం రాజ్యమేలుతున్న సమయంలో మన హిందూ ధర్మ సంరక్షణ చేస్తున్నారు స్వామీజీలు కాబట్టి ఇక్కడ సొమ్ము అక్కడికి తరలదు వాళ్ళ దేశంలో సంస్థలు జల్సా లతో బ్రతక లేవు కాబట్టి.
4. అసలు దేవుడే లేడు  లేదా హిందూ దేవుళ్ళు అభూత కల్పన - అంతే ద్వేషం పెంచుకోవడం మొదలు పెట్టుకుని తమని తాము దహించుకొంటున్నారు(తన కోపమే తనకి శత్రువు తన శాంతమే తనకు రక్ష), ప్రసాంతత కోల్పోతున్నారు.
5. నీకు ఈరోజు మాత్రమె ఉంది - ఇది అసలు కారణం ధనవంతులు ఇంకా ధనవంతులు కావడానికి, ఎవరిచేతైనా డబ్బులు ఖర్చు పెట్టించాలి అంటే ఈ మాట చాలు, నాకు దెబ్బ తగిలినప్పటి సంగతి - తలకి బలమైన గాయం కావడం వల్ల మీ అబ్బాయికి ఒక Specialist పరివేక్షణలో operation చెయ్యాలి అదీ ఈరోజే అన్నప్పుడు మా తల్లిదండ్రులు గురైన వేదన నాకు ఇప్పటికీ గుర్తే. అలాగే నేటి యువత తాగుడికి బానిసై పాడై పోతూ ఈ మాట అంటూ ఒక ధనవంతుడిని పోషిస్తున్నాడు.

నిద్ర లేవండి ఈ కుహానా వాదుల మాటలు నమ్మడం మానండి. మన సంస్కృతే మనకు గీటు రాయి. దాన్ని సరిగ్గా పాటిద్దాం.
విదేశీ ఆలోచనలు నమ్మడం మానేద్దాం.

1 comment:

  1. well said. Really empower this article to promote indian culture and tradition.

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.