Super markets ఎందుకు అవసరం?

ఈ రోజు Loot Mall offer చూసినప్పుడు నాకు అర్ధం అయ్యింది.
బడా బడా సంస్థలు తమ దగ్గర సరుకు ఖాళీ చెయ్యడం కోసం వీళ్ళకు(Super Markets) తక్కువకు అంటగట్టారు, బయట నిత్యం ఉపయోగించని సరుకులు సౌందర్య సాధనాలు ఉదాహరణకు perfumes లాంటివి, అలా super market లోకి చేరాయి కదా అప్పుటి వరకు సౌందర్య సాధనాలు మీద యుద్ధం చేసిన ప్రజలు(నిజానికి యుద్ధం కాదు ప్రకృతి లో దొరికే గంధం పసుపు ఉపయోగించే వారు అని అర్ధం) అవి తక్కువకు దొరకడంతో వాటి పక్కకు వాలారు, పైగా బద్ధకం అనే శక్తి కూడా చేరడంతో చెడ్డ మాటలు కూడా బాగా వంటబట్టాయి ఉదాహరణకు "గంధపు చెక్క నుంచీ గంధం ఆరగ తియ్యడం కష్టం" లాంటివి.
అలా ఆ సౌందర్య సాధనాలు అమ్మకాలు మొదట్లో వేగంగా జరిగేవి దాంతో వ్యాపార సూత్రం "గిరాకీ పెరిగితే ధర పెరుగుతుంది" ఆధారం గా ధరలు పెరిగాయి(ఆ సూత్రం కొన్ని విషయాలలో మాత్రమే, మిగిలిన వాటికి Advertisement cost, Models(Male/Female) cost లాంటివి, తరువాత పిచ్చి జనం నమ్మే ఇంకో చెత్త విషయం Brand).
అలా ధరలు పెరగడంతో పాటు జనాల దగ్గర ఉన్న సొమ్ము నెమ్మదిగా ధనవంతుల చేతికి చేరింది.

డబ్బు ఉన్నన్నాళ్ళు అడ్డు ఆపు లేకుండా ఖర్చు పెట్టిన జనం డబ్బు విలువ తెలిసి మరియు Newtons Third law of Motion - every action has equal and opposite reaction ని అర్ధం చేసుకోవడం మొదలు పెట్టారు, దాని ద్వారా తెలిసినది ఏమిటంటే ప్రకృతి ద్వారా తయారైన సౌందర్య సాదానాల వల్ల నష్టం వాటిల్లినా దాన్ని సరిదిద్ద వచ్చు, కానీ మనం అందంగా తయారవ్వడానికి ఇంకొకరిని అందవికారంగా చెయ్యడం మంచిది కాదు అని తెలుసుకున్నారు. ఎందుకంటే ఆ సాధనాలు చివరికి ఒక plastic డబ్బా తయారు చెయ్యడానికి రసాయనాల వల్ల నీటి కాలుష్యం, కాబట్టి వాటిని ఉపయోగించడం తగ్గించారు ఇదివరకు ౧ నెలలో పూర్తీ చేస్తే ఇప్పుడు ౩ నెలలు కానీ మానలేదు ఎందుకంటే అందం అనేది వ్యసనం కాబట్టి.

ఇప్పుడు జనాల మేలుకొలుపు వల్ల ఆ Super Markets లో Stocks పెరిగిపోయాయి, ఇప్పుడు వాటి Expiry date దగ్గరలో ఉన్నాయి, అందుకు ఈ Loot Mall offer. దీనివల్ల ౩ రకాల జనాలు నష్ట పోతారు
౧. ITC లో invest చేసిన వాళ్ళు ఎందుకంటే వచ్చే లాభంలో కొంత Bigbazaar కు ఇవ్వాలి కదా
౨. ITC Workers ఎందుకంటే ఎక్కువ అమ్మకాలు జరిగినా లాభం చాలా Bigbazaar కు పోయింది కదా
౩. మీరు ఎందుకంటే ఒక వేళ నగ్గితే Expiry date దగ్గరలో ఉన్న వస్తువులు దోచుకు వెళ్ళాలి లేదా ఏదో ఒకరోజు నెగ్గుతాం అని Yippe Noodles కొని తింటూనే ఉండాలి.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.