మేము చెట్లు అని చివరికి కాలువలలో చెత్తగా తయారయ్యారు((స)చిత్రం)

నేటి చిత్ర కధ
ఒక వ్యక్తికి ఒక అమ్మాయి మీద ప్రేమ పుడుతుంది, ఆ అమ్మాయి బంధువులు రాక్షసులు అవుతారు చివరికి ఆ వ్యక్తి ఆ రాక్షస సంహారం చేసి ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు.
రెండవ కధ
ఒక వ్యక్తియొక్క తల్లిదండ్రులను ఎవరో సంహరిస్తారు లేదా స్నేహితులకు హాని కలుగజేస్తారు ఆ వ్యక్తి వెళ్లి ఆ రాక్షసుల కూతురుని ప్రేమించి వివాహం కానిస్తాడు.
మూడవ కధ
తల్లిదండ్రులు పిల్ల వాడు చెడు అలవాట్లు నేర్చుకుంటున్నాడు అని అతనిని నిందిస్తారు వాడి స్నేహితులు వచ్చి ఆ తల్లిదండ్రులను నిందించి వీడిని తీసుకు పోతారు.

ఇవి నేటి చిత్ర కధలు, ఎంత చెత్తగా తయారయ్యాయి అంటే తప్పుడు విషయాలు ఒప్పనిపించే లాగా.

ఇక నేను పెట్టిన శీర్షిక గురించి చర్చించుకుందాం
ఇది వరకు రోజులలో చిత్రాలు పల్లెలలో చిత్రీకరించే వారు. అందువల్ల కొంతలో కొంతైనా వీళ్ళకు చిత్రాల ద్వారా చేరిన సొమ్ము మన దేశంలో ఉండేది మరియు రైతుకు ఒక వేళ పంట చేతికి అందకపోయినా ఈ ధనం కొంత ఊరట నిచ్చేది, కానీ నేటి చిత్రాలు ఎలా తరయయ్యాయి అంటే చిత్రంలో చిన్న భాగం మాత్రమే ఇక్కడ చిత్రీకరిస్తారు మిగిలినది అసలు ఈ రాష్ట్రంలో కాదు కదా ఈ దేశంలో చిత్రీకరించరు.

ఒక వేళ వెళ్ళి అడిగితె మనకి అందే సమాధానం "50 రూపాయలతో చిత్రాలు చూసేవాడికి పరాయి దేశం ఎలా ఉంటుందో చూపించాము అనే సమాధానాలే"

ఇంకో దుస్తితి ఈ నాటక రంగం ఏర్పడింది ప్రజలకు ప్రజాస్వాముల మోసాలు ఎలుగెత్తి చూపడానికి, వాళ్ళు చేస్తున్న .....గారం(చుక్కలు మీరు పూరించుకోగలరు ఎందుకంటే అది వ్రాయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు) వల్ల సొమ్ము పనికి రాని మార్గంలోకి ఎలా మరలుతుందో తెలిసేది, నేడు అదే ....గారం ఉపయోగించి భూస్వాములు ప్రతీ ఒక్కడి సొమ్మును పనికిరాని వాళ్ళ దగ్గరకు చేరేలా చేస్తున్నారు, వాళ్ళకు వాళ్ళతో విభేదించిన నాటక రంగం వాళ్ళు సహకరిస్తున్నారు.

ఇక చింతామణి నాటకం గురించి విశ్లేషిస్తే ప్రజలకు అసలు మోసాలు ఎలా చెయ్యాలో నేర్పించే నాటకం అది, పైగా దాన్ని ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు.

ఇంకొంత మంది వీళ్ళతో నే అసలు తగువు, మా శ్రమను మీరు అమ్ముకుంటున్నారు అని దుమ్మెత్తి పోసి ఎకరాలకు ఎకరాలు చేజిక్కుంచుకుని వాటిని ఇళ్ళ స్థలాలుగా మార్చేసి అమ్మడం మొదలు పెట్టారు, ఇళ్ళు ఉండకూడదా అనేది వాళ్ళ ప్రశ్న నా సమాధానం మాత్రం ఒక్కటే - ఆహారం లేకుండా ఇళ్ళు ఉంచుకుని ఏమి చేస్తాం(బీడు భూములు ఇళ్ళు కట్టడానికి ఉపయోగించుకో బంజరు భూములు కాదు).