సెలవులు - పది పనిలేని దినాలు, మొదటి రోజు

ఉదయాన్ని(4 గంటల 30 నిమిషాలకు) రాజమహేంద్రపురం చేరుకున్నాను, కాకినాడ చేరుకునే వాహనం ఇంకో గంట తరువాత మొదలవుతుంది అని అక్కడ కూర్చిని కాకినాడ తప్ప వేరొక ప్రదేశంలో ఆగని వాహనం గురించి వేచి ఉన్నాను. అలా గంట అయ్యాకా వేచి చూస్తున్న వాహనం రాలేదు, హైదరాబాదు నుంచీ కాకినాడ వెళుతున్న వాహనం వచ్చింది, వాహన చాలకుడు 82 రూపాయలు అన్నాడు, ఇచ్చి ఎక్కి కూర్చున్నాను(పడుకున్నాను). ఇంటికి చేరుకునే సమయానికి నాన్నగారు నా సంభాషణ యంత్రానికి ప్రయత్నిస్తున్నారు, అలాగే అమ్మకూడా...
ఇక ఈ రోజు అక్క, ఆమ్మ ఉన్నారు, అక్క పిల్లలతో కొంచం సమయం గడిపాను. తరువాత నిద్రపోయాను.

ఇక ఈ రోజు తెలుగు తల్లి విగ్రహం మేము నివాసం ఉంటున్న ఆవాసాలకు వ్యతిరేకంగా(Manasa Opera Apartments దగ్గర) ప్రతిష్టించారు నాకు తెలియదు కూడా(ఈ రోజు తెలుగు వారోత్సవాలలో రెండవ రోజనుకుంట), జరిపాము అన్నట్టు జరుగుతున్నాయి అని బాధ వేసింది.
అలా ఈ రోజు చివరిగా ఎక్కువ(More) దుకాణం కు వెళ్ళాము, పెరుగు తగ్గట్టే ధరలు, ధరలు ఎంత తక్కువ అంటే ఇక్కడి నుంచీ అనకాపల్లి వెళ్ళి బెల్లం తెచ్చుకోవచ్చు లేదా ప్రయాణ ఖర్చులు వాడికి చెల్లించి ఆ బెల్లం ఇక్కడ కొనుక్కోవచ్చు(మీలో చాలా మందికి ఈ ధరకు కారణాలు అనే ఒక ప్రశ్న ప్రకాశించి ఉండవచ్చు - దానికి సమాధానం "ఆ చల్ల గాలిలో క్రిములు ఉచితం"), ఇక FDI లు వస్తే పరిస్థితి ఏమిటో, వేచి చూద్దాం.