మధ్య వర్తులు ఉన్నారా పోయారా?

FDI లు వస్తే వాళ్ళు పోతారా?
లేదు పంథా మార్చుకుంటారు వీళ్ళని తీసుకు రావడానికి మన రాజకీయ నాయకులు చెబుతున్న అబద్దాలు
మొదటిది - రైతు దగ్గర తక్కువకు కొని చివరి వాడికి ఎక్కువకు అమ్ముతున్నారు దళారులు అని అంటున్నారు, మరి వీళ్ళు వస్తే ధరలు ఎలా తగ్గుతాయి?
FDI రావడం వలన ధరలు ఇంకా పెరుగుతాయి, అదే కాకుండా వస్తువు అందుబాటు తగ్గిపోతుంది, ఎందుకంటే నిల్వ చేసి ప్రతీ నేలా దొరికే మామిడి పండ్లు కోసం ఖర్చు పెరిగిపోయి ప్రజలకు దొరకక పోగా మాంద్యం పెరిగిపోతుంది.
రెండవది - ధరలు పెంచడం కోసం ఉత్పత్తి ఉన్నా వాటిని దాచేస్తున్నారు, అసలు FDI లు చేసేదే అది.
మూడవది - పన్నులు సరిగ్గా చెల్లించట్లేదు, వచ్చిన సంస్థలు పన్ను ఎగ్గొట్టే విధానాలు అనేకం అందులో మొదటిది వాణిజ్య ప్రకటనలు తరువాత వాళ్ళకు పెరిగిపోయే శీతలీకరణ ధరలు మరియు విద్యుత్తు సుంకం.

ఇక FDI ల ధర నియంత్రణ ఎలాగ
౧. శీతలీకరణ ధర.
౨. శీతల యంత్రం ధర.
౩. HR ల జీతాలు(ఇదివరకు వీళ్ళు మధ్యవర్తులు).
౪. అంగడిఅధికారి(Department Manager) జీతం.
౫. రవాణా ధర - ఇది కొంచం నాకు నమ్మశక్యం కాదు కానీ దేశం మొత్తానికి నిర్ణయించిన ధర(అదే మొన్న చెప్పాను కదా More లో బెల్లం ధర కాకినాడలో - బయట ౪౨ రూపాయలు కిలో అక్కడ ౩౮ రూపాయలు అరకిలో)
౬. పెట్టుబడిదారు లాభం(రూపాయలలో అనుకున్నారు $ లో)

ఇందులో రైతుకు చెల్లించిన ధర మరియు అక్కడ పనిచేసే వాళ్ళ జీతాలు అని అడిగేరు అవి సంద్రంలో చుక్క నీటి లాంటివి అమ్మకపు ధర పట్టికలో.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.