Windows 8 Google Ime తెలుగు ప్రవేశ పద్దతి పనిచేయట్లేదు

ఇది నాకు గత కొన్ని రోజులుగా పీడిస్తున్న సమస్య, ఎలాగా అనుకుంటే
లంకెలో తెలిపిన విధంగా Windows ౮ కు స్థాపితాలు లేవంట.

అందుకు కొంచం కష్ట పడాలి
మొదటగా మీరు ఇక్కడ నుంచీ తెచ్చుకున్న స్థాపితం వెంటనే తెరవకండి, దాన్ని మీ గణన యంత్రంలో నిక్షిప్తం చేసుకున్నకా,
ఈ పద్దతి పాటించాలి(మీకు ఆ లంకెలో చెప్పిన విధానం అర్ధం కాకపొతే నా గమనికలు ఆలకించండి)



మొదటగా మీరు దిగుమతి చేసుకున్న ఆ స్థాపితాన్ని కుడి(right) click చేసి అక్కడ చూపించిన ఇచ్చికను(Troubleshoot compatibility) ఎన్నుకోండి

తరువాత Troubleshoot Program ను ఎంచుకోండి

తరువాత పేజీలో ఏది ఎన్నుకున్నా పర్వాలేదు,


తరువాత windows ౭ లో పనిచేస్తున్నట్టు సూచించండి.


చివరిగా test program ను ఎన్నుకోండి

ఇప్పుడు వ్యవస్థాపితం గతకాలంలో పని చేసినట్టు పనిచేస్తుంది.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.