ఏమి ఆశించి చేసాను?

నిజంగా తెలియదు, అసలు వెళ్ళకూడదు అనుకున్నాను కానీ వెళ్ళాకా వాళ్ళకు సాయం చేయ్యగాలిగెను అని సంతృప్తి.
నిన్న మా నాన్నగారి మేనల్లుడి(మా తాతయ్యగారి మేనల్లుడి కొడుకు కొడుకు కూడా) గృహ ప్రవేశం, నన్ను మొన్న(సెలవులు కదా) రా అన్నారు, మొదట్లో వెళ్ళడానికి సంసయించాను, తరువాత అక్కడ ఎవరూ సాయం చెయ్యడానికి మధ్య వయస్కులు తక్కువ వెళ్ళు అన్నారు. సరే కానీ నాను వాహనం చోధానం రాదు అని చెప్పాను, సరే పర్వాలేదు అన్నారు.
అక్కడికి వెళ్ళాకా కొంత మంది గృహప్రవేశం అయ్యిన వెంటనే వెళ్ళిపోతారు అని అన్నారు అక్కడ నుంచీ వాళ్ళు పెళ్ళికి వెళ్ళాలి అట. అందరం కలిసి గృహప్రవేశానికి అవసరమైన సరంజామా అంతా ఇంటికి చేర్చాము.
ఇంతకీ నాకు పని లేదు మొన్న, రాత్రికి అందరం ఇళ్ళకు(మా ఇంటికి రాలేదు) కానీ అక్కడే వాళ్ళ ఇంటికి చేరి శయనించాము.
తరువాత రోజు ఉదయాన్నే లేగిచి స్నానాది కార్యక్రమాలు పూర్తికానిచ్చి, కొంచం మాటా మంచి పంచుకున్నాము. మా నాన్నగారి పెద్ద బావగారు(తాతయ్యగారి అక్క పెద్దకొడుకు) మరియు ఆయన ముగ్గురు తమ్ముళ్ళు స్నానం చేసేసాకా, వంట మేస్త్రి వచ్చారు అని పిలుపు. అక్కడికి చేరుకున్నాను ఉదయం ౬ గంటలకు, అప్పటికే అక్కడ మా బావ యొక్క మావయ్యగారు పనులు చేయిస్తున్నారు, అందరూ ఎవరి పనుల్లో వారు, తరువాత వంటల కార్యక్రమం సజావుగా జరగాలి మరియు వంటలు నూతన గృహానికి పంపాలి అని నాకు అప్పజెప్పారు. నాతొ పాటు మా బంధువు మా బావ స్నేహితుడు కూడా అక్కడ ఉన్నారు. వంటలు కొంచం పూర్తీ అయ్యాయి సమయం మధ్యాహ్నం ౧౨ దాటింది దాంతో ఏమి చేసాము అంటే కొన్ని అక్కడికి తరలించి అక్కడ వడ్డనలు మొదలు పెట్టండి అన్నాము,అన్నీ అయిపోతాయి కానీ బూరెలు మరియు బజ్జీలే - అవి వంతులు వంతులుగా పంపాము. నేను గృహ ప్రవేశ సమయానికి(౧౧:౦౬) అక్కడ లేను ఇక్కడే ఉన్నాను, తరువాత అంతా అయిపోయాకా మావయ్యగారు(నాన్నగారి బావగారు) వచ్చారు, ఇక ఆయన ఇక్కడ ఉండి మీరు భోజనం చేసి రండి అన్నారు, అలాగా అందరం వెళ్ళిపోయాము కొత్త గృహానికి, ఇక అక్కడ పిల్లల అల్లర్లు అన్నీ ఇన్నీ కాదు, ఎక్కువ మంది బంధుజనం మాత్రమె ఉన్నారు, స్నేహితులు తక్కువ. అన్నం మిగిలిపోయింది అది తీసుకు వెళ్ళి ఆశ్రమం లో ఇచ్చాము. అంతా ఇంటికి చేర్చి తరువాత నేను ఇంటికి చేరుకున్నాను, అక్కడ నుంచీ ఇంటికి తిరుగు ప్రయాణం. వచ్చేసరికి రాత్రి ౧౧:౩౦.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.