ఆధార్ కథ మలుపు తిరిగింది!

మనందరి కోసము: జీవిత గమ్యం ఏమిటి?: కథ ముందే చెప్పాను కదా ఏ దారి ఎంచుకోవాలో తెలియక సతమతమవుతున్న ఒక పిచ్చోడి కథ. ఈ వ్యక్తీ బ్రతికేది అంతా ఉహల్లోనే కానీ కొన్ని నిజాలు అవుతున్న...

ఈలోగా మన అగమ్యి గారికి ఒక కత్తి దొరికింది, దాంతో బెదిరించడం మొదలు పెట్టాడు.
ధర్మవరపు: ఏమి చేస్తున్నావు?
అగమ్యి: నిజం చెప్పు అసలు ఏమి చేసారు?
ధర్మవరపు: నన్నేమి చెయ్యకు జరిగింది చెబుతాను మా ప్రభుత్వం హయాంలో మా యువనేతకు డబ్బులకు కొంచం కూడా కొదవ ఉండేది కాదు ఎలా సంపాదించాడో ఎవరూ అడిగే వారు కాదు.
అలా మేము పనిచేస్తున్న గుత్తేదారు తో ఒప్పదం కుదుర్చుకున్నాడు, ఆదార్ సేకరణలు అన్నీ తికమక చెయ్యమని.
అగమ్యి: అంటే?
ధర్మవరపు: ఆ ఏముంది ఆధార్ సేకరణలు చేసిన తరువాత అందులో ఒకరి గుర్తింపు ఇంకొకరి గుర్తింపుతో మార్చడం, కొంతమంది ఆధార్ సేకరణలు తొలగించడం
అగమ్యి:ఆగాగు అదేమిటి వాళ్ళ కు ఒక వరస సంఖ్య ఇచ్చారు కదా మరి అవి
ధర్మవరపు: ఆ సంఖ్యలా అవి ఇవ్వడం ఎంతసేపు మా దగ్గర ఉన్న Hard disk పోయింది అంటే ఎవడు మమ్మల్ని నిందించగలడు?
అగమ్యి:అవును కానీ ఆ మీ యువనేత వార్తా సంస్థ ఈ ప్రభుత్వం తప్పులే అంటున్నారు కదా.
ధర్మవరపు: అదే ఆట మేము ఆయన గుత్తేదారులం కదా ఎంతైనా ఆయన వేసిన ఎత్తులో ఇది ఒకటి మా మతలబులు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఒకవేళ పీఠం మీద ఆయన కూర్చుని ఉంటే అన్నీ సరయ్యేవి.

ఇంతలో చేతిలో కత్తి చూసి రక్షకభటులు టంచనుగా వచ్చి వీళ్ళను ఠాణా కు తీసుకు వెళ్ళారు, దారంతా ధర్మవరపు అక్కడ చేసిన మోసాలు పూసా గుచ్చినట్టు చెప్పడం మొదలు పెట్టాడు.
వాటిలో ఇంకొన్ని ఒకరి పత్రాలు దొంగిలించి వారి గుర్తింపు నమోదు చేసారు, అంటే పేరు ఒకరిది గుర్తింపు చిత్రాలు వారివి కానీ హస్త సాముద్రికలు మరియు కనుబొమ్మల గుర్తింపు ఇంకొకరివి.
అగమ్యి:అదేమిటి ఎలా చెయ్యగలిగారు?
ధర్మవరపు:నమోదులు అన్నీ ఒకేసారి అందుకే చెయ్యనివ్వలేదు కదా, కాబట్టి నమోదు అవ్వని వారు చాలా మంది ఉన్నారు పైగా ఇలాంటి నకిలీ గుర్తింపులు తయారు చెయ్యడానికి శత్రు దేశం సహాయం కూడా తీసుకుంటాము, అన్నిటికీ మించి సరిగ్గా విడుదలైన వాటిని ధూమ శకటం నుంచీ బయట పడేయించాము అవి గమ్యం చేరుకోలేదు.

రక్షకభటులు:ఆపండి, నీకు ఆయుధం ఎక్కడ దొరికింది ఇక్కడ వీడిని ఏమి చేస్తున్నావు?
(సశేషం.)