జీవిత గమ్యం ఏమిటి?

కథ ముందే చెప్పాను కదా ఏ దారి ఎంచుకోవాలో తెలియక సతమతమవుతున్న ఒక పిచ్చోడి కథ.

ఈ వ్యక్తీ బ్రతికేది అంతా ఉహల్లోనే కానీ కొన్ని నిజాలు అవుతున్నాయి అన్నీ నిజాలు కావలిసిన అవసరం లేదు కదా.

ఈ రోజు ఈ వ్యక్తికీ ఒకడు పరిచయం అయ్యాడు వాడు ఆధార్ జాబితా తయారు చేసిన వాళ్ళతో పనిచేసాడు.

అగమ్యి : ఏమయ్యా ఇక్కడ ఏమి చేస్తున్నావు?
ధర్మవరపు : నువ్వు ఎక్కడ ఏమి చేస్తున్నావు.
అగమ్యి: నేనా సముద్రంలో ఒక కాగితం వేసాను గమ్యం ఎటువైపు అని ఇంకో కాగితం గాల్లో వదిలాను, మూడు రోజులయ్యాయి రెండూ నా దగ్గరకు తిరిగి రాలేదు, ఎంత ప్రయత్నించినా దొరకలేదు ఏమి చెయ్యాలో అర్ధం కావట్లేదు మూడు రోజులుగా ఎదురు చూస్తున్నాను తిరిగి వస్తాయి అని. సర్లే నాగురించి ఎందుకుగానీ నీ గురించి చెప్పు.
ధర్మవరపు:ఆ ఏముందయ్యా నా పేరు ధర్మవరపు మొన్నే నన్ను పనిలోనుంచీ తీసేశారు ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను?
అగమ్యి: ఇంకో పని వెతుక్కోవచ్చు కదా!
ధర్మవరపు:ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు నువ్వే కదా గుర్తింపు జాబితా గురించి నమోదు కార్యక్రమంలో ఉన్నావు కదా మా గుర్తింపు పత్రం ఇంకా ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు తప్ప ఉద్యోగం ఇవ్వడానికి మొగ్గట్లేదు.
అగమ్యి: ఏమి పత్రాల గురించి మాట్లడతున్నావు?
ధర్మవరపు: అదే ఆ పత్రాలు కొత్తగా గుర్తింపు పత్రాలు అంటున్నారు కదా ఆధార్ పత్రాలు.
అగమ్యి: వాటి గురించి కొంచం చెప్పండి నాకు వాటి గురించి మాకు తెలియదు.
ధర్మవరపు; అందరికీ అవిలేకపోతే నిత్యావసర వస్తువులు అందవు కదా, మీకు తెలియదా?
అగమ్యి: తెలియదు నేను కిరణా అంగడికి వెళ్ళినప్పుడు అడగలేదు, నేను Private ఆసుపత్రికి వెళ్ళాను వాళ్ళు కేవలం నా దగ్గర డబ్బు ఉందా లేదా అని చూసారు, నేను మా బంధువుల అబ్బాయిని పాటశాలలో చేర్పించడానికి వెళ్ళాను అక్కడ కేవలం వాళ్ళు పిల్లవాడి తల్లిదండ్రులు ఎంత చదువుకున్నారు వాళ్ళకు వాహనం ఉందా ఇల్లు ఉందా అని మాత్రమే అడిగారు, మధ్యలో ఇదేమిటి?
ధర్మవరపు: గుర్తింపు పత్రం.
అగమ్యి: నా దగ్గర ఇప్పటికే చాలా పత్రాలు ఉన్నాయి వాటి పేర్లు
Passportoooooooooo
pan cardoooooooo
birth certificatoooooooooo
voter ideeeeeeeee
ration carduuuuuuuuuuu
10th Marks listooooooooo
ధర్మవరపు:అవి నువ్వు స్వదేసీయుడివో విదేసీయుడవో తెలిపేవి కాదు!
అగమ్యి:ఎన్నో కష్టాలు పది passport తెచ్చుకుంటే అవి పనికిరావు అంటావా?
ధర్మవరపు: అలా కాదు వాటిలో నకిలీ గుర్తింపు పత్రాలు ఉన్నాయి అందుకు
అగమ్యి: అంటే visa ఇచ్చే వాళ్ళకు నకిలీలైనా పరవాలేదా?
ధర్మవరపు: అలా కాదయ్యా  బొత్తిగా లోక జ్ఞానము లేని వాడిలా ఉన్నావు, అప్పుడెప్పుడో Nandan Nilekhani చెప్పారు తెలియదా ఇది ఎందుకు ఉపయోగమో?
అగమ్యి: ఆయనకు డబ్బు వస్తుంది కాబట్టి ఈ ఉపాయం చెప్పుంటారు, అయినా అసలు ఆయన ఎవరు?
ధర్మవరపు:నీతో వేగలేక పోతున్నాను ఎలాగ చెప్పేది?
అగమ్యి:సర్లే నీ మాటకే వద్దం అయితే మాకు కలిగే లాభం ఏమిటి?
ధర్మవరపు:నువ్వు నువ్వు అని ప్రభుత్వం గుర్తిస్తుంది.
అగమ్యి:అంటే నేను నేను కాదు నువ్వు అనుకుందా ప్రభుత్వం?
ధర్మవరపు:క్షమించవయ్యా నా అభిప్రాయం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీలు మరియు రాయితీ నీకు చేరుతున్నాయి అని మధ్యలో ఇంకొకరికి వెళ్ళట్లేదు అని.
అగమ్యి: అంటే తప్పు చేసినవాడిని శిక్షించను  తప్పు జరగకుండా చూస్తాను అంటున్నారు కదా?
ధర్మవరపు:అర్ధం కాలేదు!
అగమ్యి:బియ్యంలో రాళ్ళు కలిపి అమ్మారు మరియు మంచి బియ్యం దొడ్డిదారి పట్టించి మక్కి పోయిన బియ్యం తెప్పించి అమ్మారు ration dealars వాళ్ళ మీద చర్యలు తీసుకోరు కానీ ప్రభుత్వ నిధులు ఇలా వృధా చేస్తున్నారా?
అగమ్యి: ఎక్కడికి పారిపోతున్నావు?
ధర్మవరపు:మాకు ప్రభుత్వానికి పడకే కదా నన్ను ఉధ్యోగం నుంచీ తొలగించారు ఇప్పుడు ప్రభుత్వం గురించి నన్ను అడుగుతావేమిటి?
అగమ్యి: ప్రభుత్వానికి మీకు పొసగక పొతే నీ ఉద్యోగం ఎందుకు పోయింది?
ధర్మవరపు: అది పెద్ద మోసం, మధ్యలో నన్ను ఇరికిస్తారు అని మా యజమానితో గొడవ పెట్టుకుని నేను బయటకు వచ్చేసా!
అగమ్యి: ఏమిటా మోసం? నిన్ను ఎందుకు ఇరికిస్తారు?
ధర్మవరపు: ఏమిటయ్యా నీ బాధ? అయినా ఆ పత్రం నీకు అవసరం లేనప్పుడు దాంట్లో మోసాల గురించి నీకెందుకు?
(సశేషం......)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.