గమ్యం ఏమిటి? ఏ దారి ఎన్నుకోవాలి?

మనందరి కోసము: ఏది విచ్చిన్నం చేస్తున్నారు(ఆధార్ కథ మలుపు తిరిగిం...: అవి మూడు నెలలు పైచులుకు ఉన్న FIR మరియు పాత వాహనాలు(దొంగిలించ బడినవి) మరియు దస్తావేజులు. సమాధానాలు చెబుతారా?

ఈలోగా అక్కడికి ఒక విలేఖరి ఈ భాగోతం చూసి చిత్రీకరించడం ప్రారంభించాడు.......

ఇక్కడ పెద్ద గందరగోళం జరగబోతుంది అని అనుకున్నాడు అగమ్యి, అసలే చీకట్లో రాజుగారు కదా అక్కడ చోద్యం చూస్తూ కూర్చున్నాడు,  అక్కడ విలేఖరి చిత్రీకరించడం పూర్తయింది, తరువాత బేరసారాలు మొదలు పెట్టాడు మొత్తానికి బేరం కుదిరింది ఈ మొత్తం చిత్రీకరణ ఆ భోగి మంటలకు ఆహుతి అయ్యింది.

ఏమిటో మన అగమ్యి గారికి ఈ రోజు ఎలాగైనా తన గమ్యం ఏమిటో తెలుసుకోవాలి అని  అక్కడ మఠం ఒకటి ఉంటె అక్కడికి వెళ్ళాడు.

అక్కడ స్వామి వారికి ఒక భక్తుడికీ మధ్య విచిత్రమైన సంబాషణ వింటూ నిలుచుండి పోయాడు.

స్వామి:ఏమి నాయనా ఏమిటి నీ కష్టం
భారతీయుడు :మీరు మా స్థలాలు దోచుకుని గుళ్ళు గోపురాలు కట్టుకుంటున్నారు అని సగటు భారతీయుడుగా నా ప్రశ్న.
స్వామి: చెడ్డ వారి వల్ల మేము తప్పు చేయక పోయినా తప్పు చేసినట్టు  చూపబడుతుంది.
అగమ్యి: స్వామీ నేను ఎప్పుడూ అలా అనుకోలేదు స్వామి
స్వామి: నాయనా నేను నీగురించి అనలేదు,కొంతమంది గురించి.నేను కొన్ని నియమాలు పెట్టుకున్నాను వాటిని ఆచరించడం నా ధర్మం కాబట్టి ఈ ఆ ఆశ్రమ జీవితం.
భారతీయుడు: ప్రతీ స్వామీజీ వల్లే వేసే మొదటి పదం నా ధర్మం
వ్యతిరేకి: ఏ మీరు కాదేంటి డబ్బోస్తే ఒకడికి జేజేలు పలుకుతారు డబ్బు రాకపోతే తిడతారు అది మీరు పెట్టుకున్న ధర్మం కాదా?
స్వామి: మీరు కొట్టుకోవడం బావ్యం కాదు, నాకు నేనుగా పెట్టుకున్న కొన్ని నియమాలు
౧. ఆడి తప్పరాదు
౨. ఉల్లిపాయ తినరాదు
భారతీయుడు: ఆపండి మీరు తినడం తినకపోవడం మీ ఇష్టం కానీ ఇంకొకరిని తినకూడదు అని ఎలా ఆదేశిస్తారు
వ్యతిరేకి:మీరు మాత్రం తక్కువా మాంసాహారం తినకపోవడం తప్పుగా చూపించాట్లేదా దాని వల్ల ఎన్ని అనర్ధాలు, ప్రతీ మాంసాహారం తయారీకి అయ్యే ఖర్చుతో ౨౦ మంది తినే ఆహారం తయారు చెయ్యవచ్చు.
భారతీయుడు:నీకు స్వామీజీ ఏమైనా డబ్బులు ఇచ్చారా ఆయనను ఆకాశానికి ఎత్తుతున్నావు?
వ్యతిరేకి:నేను ఇందాకానే చెప్పాను నీ స్వభావం అది ఇప్పుడు మళ్ళీ ప్రస్పుటంగా కనిపిస్తుంది.
స్వామి:నేను ముందే చెప్పాను నా అభిప్రాయం నేను చెబుతాను అని, నన్ను చెప్పనివ్వకుండా మీరు చెప్పడం వలన అర్ధం మారి పోతుంది.
ఇక ఉల్లిపాయ తినకూడదు అన్న నా నియమం యొక్క కారణం ఉల్లిపాయ ముక్కలుగా తరిగి భోంచేస్తారు కానీ వాటి మీదకు ఎక్కినా క్రిముల గురించి ఆలోచించరు, వాటిని(క్రిములను) మనం ఆహారంగా తీసుకుంటాం.
భారతీయుడు:ఆ మీరు అలాగే చెబుతారు కానీ మనం ఉడక పెట్టి మాత్రమే తింటాము.
స్వామి:నాయనా ఇక్కడ మేము ఎవరినా భక్తులు లేదా దాతలు కానుకగా ఇచ్చినప్పుడు మాత్రమె ఉడకబెట్టినవి తింటాము మిగిలిన రోజులలో కాదు, ఇక ఎన్నో సార్లు వైధ్యులు కూడా ఒప్పుకున్నారు ఒక ఉడకబెట్టిన వాటిలో పోషక విలువలు తగ్గిపోతాయి అని.
భారతీయుడు:ఆ వైధ్యుడే చెప్పాడు మీరు చేస్తున్న భూ కబ్జాల గురించి.
స్వామి: ప్రశ్న ఒకటి అడిగావు నా సమాధానం పూర్తికాక మునుపే ప్రశ్నలు సంధించి తికమక పెట్టి నువ్వే రాజువు నేను రాక్షసుడిని అని నిరూపిద్దాం అనుకున్నట్లనిపిస్తుంది.
భారతీయుడు: అలా కాదు స్వామి.
స్వామి:సరే విను మేము పాటించే ఆహారపు అలవాట్లు శరీర నిర్మాణానికి అవసరమైన వాటి కోసం మాత్రమె ఉంటాయి కానీ నేను పని చేసి పక్కవాడి ఆకాలి తీర్చేవి కాదు, అలా అంటే మీకు ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అన్ని వేళలా ఆహారం ఉత్పత్తి కాదు మరియు అందరూ పని చెయ్యలేరు ఎల్లవేళలా అని?
మా ఆశ్రమం అన్నీటికీ సమాధానం ఉంది, మొదటగా మీ ప్రశ్న అన్ని వేళలా ఆహారం ఉత్పత్తి కాదు అని, ఆహారం ఉత్పత్తి అవ్వని వేళ ఉపవాసాలు చేస్తాం, నిరంతరం ఆహారం ఉత్పత్తి చేస్తూ ప్రకృతిని నాశనం చెయ్యడం మంచిది కాదు. ఇక రెండవ ప్రశ్న కొందరు శక్తి లేని వారు ఉంటారు అని, ఎల్లప్పుడూ ౧౦ మంది ౧౫ మందికి చేసి పెట్టగలరు ఒకరు అనారోగ్యంగా ఉన్నా వ్రుద్దులైనా లేదా అభాగ్యులు అయినా సాయం చేసే చెయ్యి ఉండనే ఉంటుంది. పని చెయ్యగలిగి చెయ్యక పోవడం ఎప్పుడూ తప్పే.
భారతీయుడు:అందరూ చెప్పే మాటే అది, మీరు ఇప్పుడ పని చేస్తున్నారా నాకు బోధిస్తున్నారు కానీ
స్వామి: నాయనా ఈ రోజు నేను ఉపవాసం, ప్రకృతిలో కొన్ని రోజులు కొన్ని విషయాలకు అనువుకాదు, అలాంటిదే ఈ రోజులు.
భారతీయుడు: అదేమిటి అన్నం వచ్చేది ఈ కాలంలోనే కదా
స్వామి: నేను మునుపే చెప్పాను వండించినవి తినను అని కాబట్టి మాకు బియ్యం ఇప్పుడు లభ్యం అయినా సంవత్సరం పొడుగునా లభ్యం అయినా ఒకటే, ఇక రెండవది ఈ చలి కాలంలో శరీరానికి కొంచం అలసట వస్తుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ కొంచం స్థిమితంగా ఉండదు అంటే ఆహారం జీర్ణం అవడానికి సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి.
భారతీయుడు: ఈ ప్రశ్నలకు సమాధానం చాలా సులువుగా చెప్పారు కానీ నేను అడిగిన ఆఖరి ప్రశ్న భూకబ్జాలు, ఆ ఇంకో విషయం మీ ఆశ్రమంలో డబ్బులు కట్టించుకుని ఆశ్రయం ఇస్తారు అని విన్నాను
స్వామి:మొదటి ప్రశ్నకు సమాధానం ప్రకృతిలో సహజంగా లభించే వాటిని మొక్కలు పెంచి అందరికీ అందించడం భూ కబ్జా అయితే మాది భూకబ్జానే.
వ్యతిరేకి:ఆ పత్రికల వార్తలు మీరు చదువుతున్నారా, ఆ పత్రికలు డబ్బు ఇస్తే చెడును మంచిగా చూపిస్తారు, ఇంకో విషయం ప్రకృతిలో కాలుష్యం తగ్గితే రోగాలు అవే తగ్గుతాయి.
స్వామి: నాయనా నువ్వు చెప్పినది నిజం. ఇక మీ రెండవ ప్రశ్నకు సమాధానం నా దగ్గరలేదు, ఎందుకంటే వాటికి సమాధానం ఆ డబ్బు అందుకున్న వాడు చెప్పాలి నేను కాదు.
మధ్యవర్తి: క్షమించాలి మీకు ఆ ధనం కేవలం రుసుముగా కనిపిస్తుంది కానీ వాటితో మాకు అప్పుడప్పుడు అవసరాలు తీర్చుకోవడం జరుగుతుంది.
మొదటగా ఇక్కడ కొంతమంది అనాధలు ఉన్నారు వారి విద్యా బుద్దులకు అవి ఉపయోగిస్తాం, ఎంతైనా మనం పెరుగుతున్నది వస్తు ప్రపంచంలో కదా, ఇక్కడ వస్తువుకున్న విలువ మనిషికి ఏనాడో పోయినది.
ఇక రెండవది దుస్తులు కొనుగోలుకు, ఇక మూడవది మనవ సహజత్వం ఉచితంగా దొరికేదానికి పరుగులు తీయడం, ఇక్కడ నా అభిప్రాయం మేము ౧౦౦ రూపాయలకు అన్నీ లభిస్తాయి అని అన్నామా ఇక ఇక్కడ ఉడడం మాత్రమే కోరుకుంటారు కానీ మేము అలాంటి సమాజం స్థాపించాలి అని కోరుకోరు, ఇక చివరిగా అప్పు తీసుకుని వైద్యం చదివి ఆ అప్పు తీరుస్తున్న కొందరు కోసం ఆ డబ్బు కావాలి.
స్వామి: నాయనా అది అన్యాయం మనం ఇక్కడ స్థాపించినది లాభాపేక్ష ఆశించి కాదు కదా, మరి ఆ వైద్యులకు ఎందుకు అంత భారీ ఎత్తున్న చెల్లించాలి?
మధ్యవర్తి: మీరే చెప్పారుగా స్వామి అందరి శరీరం ఒకలా ఉండడు అని, వారిని మన ఆశ్రమ అలవాట్లకు తీసుకురావడానికి కొంచం సమయం పడుతుంది, ఈలోగా అతనికి అనారోగ్యం వస్తే, అదే స్వామి ఇంతవరకూ తీసుకున్న విషం ఇప్పుడు శరీరంలో తన పని చెయ్యడం ప్రారంభిస్తే అని.
స్వామి:నీవు ఎన్నైనా చెప్పు ఈ విషయం గురించి మనం ఆలోచించాలి.
భారతీయుడు:మాతో ఇలా అంటారు మళ్ళీ యధావిధిగా ఉంటుంది.
వ్యతిరేకి:నీకు అర్ధంకాదు, సర్లే నువ్వు మొన్న గోదావరిలో విహారయాత్రలు చేసావు అని విన్నాను ఎంతయ్యింది?
భారతీయుడు: ఏముంది ఓ పదివేలు చెల్లించాను, రాను పోను ఇంకో పదివేలు.
వ్యతిరేకి: ఎన్ని రోజులు ?
బారతీయుడు(ముభావంగా): ఒక్క రోజు
వ్యతిరేకి: ఇక నీకు అడిగే అర్హత లేదు.
భారతీయుడు(కోపంగా): ఎందుకు?
వ్యతిరేకి:ఎందుకంటే !
అగమ్యి:ఇంతకీ నేను ఏ మార్గం ఎన్నుకోవాలి?
(సశేషం..)