నలుపు తెలుపుల జీవితం (తస్మాదపరిహార్యేర్ధే - మూడవ భాగం)

పురాతన జీవన విధానం ఎన్నుకుంటే తప్పే (గమ్యం ఏమిటి? ఏ దారి ఎన్నుకోవాలి?) భారతీయుడు:ఎవరు నువ్వు? అసలు అన్ని patents నీ పేరు మీద ఎందుకు ఉన్నా...
మనందరి కోసము: తస్మాదపరిహార్యేర్ధే(పురాతన జీవన విధానం ఎన్నుకుంటే ...
 భారతీయుడు:ఏమిటా మంచి ఏమిటా చెడు?
స్వామి: కష్టపడటం మంచి, AC వేసుకుని కష్టపడటం. ఇంకా చాలా ఉన్నాయి.అవి అప్రస్తుతం ఇక నేనుపరిహారం చేసుకోవడానికి గల కారణం దగ్గరకు వస్తున్నాను.
మేము ఇద్దరం డబ్బుకోసం పరిగెట్టడం ఆరంభించాం, సోమవారం నుంచీ శుక్రవారం వరకు Stock trading, మరియు మిగిలిన రెండు రోజులూ stock broker తో చర్చలు, వచ్చేవారం ఏ సూచీకి పెరుగుతుంది అని అభిప్రాయం ఇవ్వాలి అని.
భారతీయుడు:నువ్వు ఇచ్చే వాడివా?
స్వామి:అవును, మా దగ్గర ఉన్న shares కు పెరుగుతుంది అని అభిప్రాయం చెబుతాం, మరి పెరుగుతుందా అని అనుమానం వస్తుంది కాబట్టి stock broker మేము కలిసి కొనడం ప్రారంభిస్తాం."ఎవరికీ సంస్థలో జరుగుతున్న పని ఏమిటి అవసరం లేదు", అడిగేవాడూ ఉండడు. ఈ stock broker కు డబ్బుల వార్తా channels తో సత్సంబంధాలు ఉండేవి, మేము చెప్పినట్టు ప్రచురించడం వాళ్ళకు అలవాటు.
సంస్థకు స్థలం కేటాయిస్తే సంస్థ యొక్క సూచీ ధర ఎలా పెరుగుతుంది అని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా, ఆలోచించరు. అదే మానవ నైజం ఇంకొకడు లాభం పొందేస్తాడు అని ఆలోచించకుండా ఇంకొకరికి డబ్బులు ఇవ్వడం అలవాటే కదా.
ఇలా డబ్బు సంపాదనలో పరిగెడుతూ, మా తల్లిదండ్రుల గురించి పట్టించుకోవడం మానేసాను, ఇంటికి డబ్బులు పంపాల్సిన అవసరం లేదు. ఒక రోజు వాళ్ళ అవసరం వచ్చింది, నా భార్య గర్భవతి, చూడడానికి ఎవ్వరూ లేరు అందుకు ఇంటి దగ్గర నుంచీ తల్లిదండ్రులను రప్పించాను.
భారతీయుడు:అదేమిటి భారతదేశంలో చేయించవచ్చు కదా
స్వామి:నా సలహాలే నన్ను ఆ పని చేయించ నివ్వలేదు, కాన్పు సరిగ్గా అవుతుంది అని తెలిసినా operation అవుతుంది అని నమ్మించి ఆ test ఈ test అని చెప్పించి డబ్బులు దండుకోవడం అలవాటు చేయించాను. ప్రజలు ప్రజలనే అడగనివ్వని స్థాయికి తెచ్చారు, అదెలాగంటే ఆ ఆసుపత్రిలో అందరూ పెద్ద పెద్ద వైధ్యులు అని చెప్పడం మరియు వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులలో చాలా సంవత్సరాలు పనిచేసారు అని చెప్పడం, ఎవరో తమని పొడవక్కర్లేదు వాళ్ళే వాళ్ళ కళ్ళు పోడుచుకోవడం అలవాటే కదా. ఇక రెండవ కారణం అక్కడ జన్మిస్తే అక్కడే వాళ్ళకు జాతీయత్వం వస్తుంది కాబట్టి.
మా తల్లిదండ్రులు మనవడితో కొంతకాలం గడపాలి అని కోరుకున్నారు కానీ వాళ్ళకు ఆరోగ్యం క్షీణించడం తో వెంటనే భారతదేశానికి పంపడం జరిగింది.
అసలు వాళ్ళకు అప్పటివరకూ క్షీణించని ఆరోగ్యం ఒక్కసారిగా ఎలా క్షీణించింది అని ఆలోచించలేదు, వాళ్ళకు సపర్యలు చెయ్యలేదు.
కాలం గడిచింది కొన్ని రోజుల తరువాత, నా పిల్లవాడికి ఆరోగ్యం క్షీణించింది ఈ సారి  రప్పించడానికి ప్రయత్నించాను, వాళ్ళు దొరకలేదు, బంధువులకు ప్రయత్నించాను ఎవరూ సమాధానం ఇవ్వలేదు.
నా పుత్రుడి ఆరోగ్యం గురించి ఒక వేదన, తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలియక సతమతమవుతూ ఉన్నాను, ఎప్పుడు చెప్పిందో తెలియదు నా భార్య తల్లిదండ్రులు ఇక్కడకు చేరారు.
నా పుత్రుడికి కొంత కుదుట పడింది. మళ్ళీ నా పరిశోధనలు జరుగుతున్నాయి, తరువాత ఒక రోజు తెలిసింది నేను video chat చేసేది నా తల్లిదండ్రులతో కాదు నా మామగారు తయారు చేయించిన Virtual Humanoid అని.
ఆ రోజు అడిగితే పెద్ద యుద్దమే జరిగింది. ఇక ఈ గమ్యం సరైనది కాదు అని ఆమెకు విడాకులు ఇచ్చి భారతదేశానికి తిరిగి వచ్చాను, నా ఆస్తిలో సగం నా భార్యకు ఇచ్చేశాను. ఇక మిగిలిన ౩౦౦ వందల కోట్లతో ఇక్కడ జీవితం సాగిద్దాం అని వచ్చాను.
వచ్చిన తరువాత తెలిసింది నా తల్లిదండ్రులు ఎప్పుడో ఆస్తి మొత్తం దానం ఇచ్చేసి ఈ అనాధ ఆశ్రమానికి వచ్చారు అని.
ఈ గ్రామం కు వస్తుంటే అడుగడుగునా నేను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్న వారే కనిపిస్తున్నారు.
నేను నల్లగా మారితే నన్ను నేను అసహ్యించుకోవడం జరిగేది, ప్రకృతి సమానత్వ సిద్దాంతం ప్రకారం నువ్వు ఆనందంగా జీవిస్తున్నావు అంటే ఇంకొకరు బాధ పడుతున్నారు అని, అంటే నేను తెల్లగా మారాను అంటే ఇంకొకరు నల్లగా మారారు అని అర్ధం.
నాకు డబ్బులు వచ్చాయి అంటే ఇంకొకరికి డబ్బులు పోయాయి అని అర్ధం అయ్యింది.
ఇక Christian missionarires మాట మార్పిడులు ఎందుకు చేయిస్తారో అర్ధం అయ్యింది, వాళ్ళు చేసిన తప్పు కు వాళ్ళు బాధ పడలేరు కాబట్టి, ఆ బాధను అనుభవించడానికి ఇంకొకరిని తయారు చెయ్యాలి కాబట్టి, ఈ missionaries చేస్తున్నది అదే, వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళకు పంచుతారు, ఆ బాధ వీళ్ళు అనుభవిస్తారు.
(సశేషం .........)