తస్మాదపరిహార్యేర్ధే(పురాతన జీవన విధానం ఎన్నుకుంటే తప్పే!) - రెండవ భాగం.

 పురాతన జీవన విధానం ఎన్నుకుంటే తప్పే (గమ్యం ఏమిటి? ఏ దారి ఎన్నుకోవాలి?) భారతీయుడు:ఎవరు నువ్వు? అసలు అన్ని patents నీ పేరు మీద ఎందుకు ఉన్నాయ...మనందరి కోసము: తస్మాదపరిహార్యేర్ధే(పురాతన జీవన విధానం ఎన్నుకుంటే ... . .
భోజన సమయానికి అరగంట మునుపే అక్కడ వృద్ధ ఆశ్రమానికి వెళ్ళారు, భోజన సమయానికి బయటకు వచ్చారు. అగమ్యి మధ్యవర్తి ని అడిగాడు ఎక్కడికి వెళ్ళారు అని, దానికి తప్పుకు పరిహారం తీర్చుకోవడానికి గత ౭ సంవత్సరాలుగా అక్కడ పడిగాపులు కాస్తున్నారు.
అగమ్యి:ఎవరికీ ?
మధ్యవర్తి:అతని తల్లిదండ్రులకు?
అగమ్యి:ఏమి తప్పు చేసాడు?
మధ్యవర్తి:ఇప్పటి వరకూ మాకూ చెప్పలేదు.

స్వామి అక్కడ కూర్చునే ఉన్నారు, అందరూ ఫలహారాలు తినడానికి వెళ్ళారు, అగమ్యి అక్కడే ఉన్నాడు.
స్వామి: నీవు వెళ్ళి ఫలహారం భుజించు.
అగమ్యి: ఏమో మీరు చెబుతున్నది కథలా ఉంది, మతమార్పిడి సంస్థలు అవలంభిస్తున్న పద్దతిలా ఉన్నాయి.
స్వామి:వారు నేను ఒకటే అని ఎలా అనుకుంటున్నావు?
అగమ్యి: వాళ్ళు కూడా అంతే, ఎవరైనా బాధలో ఉంటే అక్కున చేర్చుకుని మతం మార్పించడం లేదా వేరే మతం మీద ద్వేషం పెంచే ప్రవచనాలు చెయ్యడం.
స్వామి: నేను వేరే మతం మీద ఇప్పటి వరకూ విషం చిమ్మలేదు, మతం ఎప్పటికీ చెడ్డది కాదు, కానీ దాన్ని స్వప్రయోజనం కోసం మార్చుకోవడమే తప్పు.
అగమ్యి:అర్ధం కాలేదు.
అందరూ ఫలహారం ముగించాకా చెప్పుకుందాం.
ఫలహారం ముగించి అందరూ తిరిగి వచ్చారు.
భారతీయుడు:ఇందాకా భోజన సమయం మునుపు మమ్ములను వదిలి ఎందుకు వెళ్ళారు?
స్వామి: తస్మాదపరిహార్యేర్ధే
భారతీయుడు:అంటే?
స్వామి:నా తప్పులకు పరిహారం కోసం
భారతీయుడు:ఏమి తప్పులు చేసారు,
స్వామి: చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ రోజు  మా గురువుగారు నీకు ముక్తి కలిగించే ఒకరు నీకు పరిచయం అవుతారు అని చెప్పారు, అతను ఎవరు అని మాత్రం చెప్పలేదు. ఈ విషయం ఇప్పటి వరకూ మా గురువుగారితో మాత్రమే  చెప్పాను ఎవ్వరికీ చెప్పలేదు.
డబ్బు గురించి  ఏను చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కాదు. పెట్టుబడి దారి వ్యవస్థ గతి తప్పిన విధానం నా జీవితంలో ప్రతీ అడుగునా కనపడుతుంది.
భారతీయడు:అంటే మీ అభిప్రాయం ప్రకారం పెట్టుబడిదారి వ్యవస్థ ఉండాలి అనా?
స్వామి:ఉండకూడదు అని అనుకున్నా దాని అవసరం జీవితంలో ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది, మనం అసలు విషయం నుంచీ దూరంగా వెళుతున్నాము. ఇక్కడ నేను చేసిన తప్పుల గురించి చెబుతాను అన్నాను, వాటి గురించే చెబుతాను.
మొదట ఉద్యోగం రాగానే ధూమపానం అలవాటయ్యింది, ఇక మద్యం స్నేహితులు అలవాటు చేసిందే ఉద్యోగం రాగానే ఇంకా పెరిగింది, మాంసాహారం పడకపోతే రోజు గడవదు. ఈలోగా ఒక రోజు ఒక యువతి పరిచయం అయ్యింది. గతి తప్పిన నాకు ప్రేమ తప్పు అనిపించలేదు. ఉదయం ఉద్యోగం సంధ్యా సమయంలో Bar's and pub's. వచ్చిన జీతం మంచినీళ్ళ ప్రాయం.
ఇక ఇలా కుదరదు అని, ఒక స్నేహితుడు సాయంతో Stock market లో పెట్టుబడులు, జూదం డబ్బు తెచ్చే అన్ని చెడ్డ విధానాలు నాకు అలవాటే, అలాగే ఖర్చు పెట్టడం కూడా.
భారతీయుడు: చెప్పొచ్చు కదా మేమూ తెలుసుకుంటాము.
స్వామి:చెప్పను గాక చెప్పను, నీతి కథలు ఎన్ని విన్నా అందులో చెడు మాత్రమె గ్రహించే స్థాయిలో ఉంది నేటి సమాజం.
భారతీయుడు: ఆ చెప్పొచ్చావులే.
స్వామి:నమ్మకపోవడం నీ ఖర్మ. ఇక నేను చేసిన తప్పులకు నాకు శిక్ష పడటం మొదలయ్యింది. పెళ్ళి తరువాత రోజూ నేను కార్యాలయానికి వెళ్ళడం నా భార్యామణి stock trading చెయ్యడం, ఇక వచ్చాకా నేను stock trading చెయ్యడం నా భార్య వంట చెయ్యడం దిన చర్య.
నా చర్మ స్వభావం ప్రకారం నేను మంచి చేసిన దినమున నల్లగా, చెడు చేసిన రోజున తెల్లగా ఉంటాను.
భారతీయుడు:ఏమిటా మంచి ఏమిటా చెడు?
స్వామి: కష్టపడటం మంచి, AC వేసుకుని కష్టపడటం. ఇంకా చాలా ఉన్నాయి.అవి అప్రస్తుతం ఇక నేనుపరిహారం చేసుకోవడానికి గల కారణం దగ్గరకు వస్తున్నాను
(సశేషం...)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.