కలిసి ఉంటే కలదు సుఖం - నలుపు తెలుపుల జీవితం (తస్మాదపరిహార్యేర్ధే - నాలుగవ భాగం)

పురాతన జీవన విధానం ఎన్నుకుంటే తప్పే (గమ్యం ఏమిటి? ఏ దారి ఎన్నుకోవాలి?) భారతీయుడు:ఎవరు నువ్వు? అసలు అన్ని patents నీ పేరు మీద ఎందుకు ఉన్న...
మనందరి కోసము: నలుపు తెలుపుల జీవితం (తస్మాదపరిహార్యేర్ధే - మూడవ భ...
స్వామి:ఇక Christian missionarires మాట మార్పిడులు ఎందుకు చేయిస్తారో అర్ధం అయ్యింది, వాళ్ళు చేసిన తప్పు కు వాళ్ళు బాధ పడలేరు కాబట్టి, ఆ బాధను అనుభవించడానికి ఇంకొకరిని తయారు చెయ్యాలి కాబట్టి, ఈ missionaries చేస్తున్నది అదే, వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళకు పంచుతారు, ఆ బాధ వీళ్ళు అనుభవిస్తారు.
కర్మ సిద్దాంతం ప్రకారం ఎవరు చేసిన తప్పులకు అప్పుడే శిక్ష పడుతుంది, కానీ ప్రస్తుతానికి ఆ శిక్షను వేరే వాళ్ళకు మళ్ళిస్తారు ఈ Christian missionaries, కానీ చేసిన తప్పులకు ఎప్పటికైనా శిక్ష తప్పదు తప్పించుకోలేరు.
నేను చేసిన తప్పుకు ఇక్కడ ప్రజలు శిక్షకు గురయ్యారు, ఈ గ్రామంలో ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండేవి, కానీ పారిశ్రామికీ కరణ వలన నీళ్ళు ౩౦౦౦ kilo meters దూరంలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి కొడుకు కోసం మళ్ళించారు, ఇక్కడ నా తప్పు కూడా ఉంది - ఇక్కడ చెరువులు ఉండటం వలన వర్షం నీరు నిలవ చెయ్యగలుగు తున్నారు, దాని వల్ల నదిలో నీటి శాతం తగ్గుతుంది ఇలా ఈ చుట్టూ పక్కల ఊళ్లలో చాలా చెరువులు కప్పెట్టించాముc, మరి ప్రజలకు అనుమానం రాలేదా అని మీ అభిప్రాయం కదా, విదేశీ జీవన విధానం తెలుసుకుని ఆరోగ్యవంతమైన జీవన విధానం మరచి పోయారు.
భారతీయుడు: అంటే, అర్ధం కాలేదు?
 స్వామి: మన జీవన విధానం ఎక్కడ గ్రంధస్థం కాలేదు, గ్రంథస్థం అయినదే నిజం అని నమ్మే విధానం. కెంపెగౌడ కథ ఆయన బెంగలూరు కట్టించారు, మరి అది నివాసయోగ్యంగా మరల్చడానికి ౧౧౬ చెరువులు తవ్వించారు వర్షపునీరు నిల్వ ఉంచడానికి, కానీ ఇప్పుడు ౨౬ చెరువులు మాత్రమె ఉన్నాయి అవి మిగలడానికి కారణం ప్రజలు పూడ్చడానికి ఒప్పుకోక పోవడమే.
కానీ ఇక్కడి ప్రజలను మొదట్లో మేము ఏమర్చాము, ఈ చెరువులు నిరుపయోగం ఈ చెరువులు పూడ్చి ఇక్కడ భవనాలు కడితే  అభివృద్ధి అని, పిచ్చి జనం నమ్మరు, ఈ జనంలో కొంతమంది తెలివైన వారు అభివృద్ది అంటే ఇదే అని తందనాలు పలికారు.
చెరువులు పూడుకు పోయాకా అసలు కష్టాలు మొదలయ్యాయి. అందులో మొదటిది వేసవి కాలం వచ్చేసరికి బావులు నిండుకోవడం, ఇళ్ళు కట్టాకా ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం జరిగాయి, ఎవరు లాభ పడుతున్నారు అన్నది అనవసరం తన వాళ్ళ దగ్గర నుంచీ దూరంగా పోవడం ప్రతీ ఒక్కరికీ అలవాటే కదా, ఇలా ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం వలన కూడా నీటి అవసరాలు పెరిగిపోయాయి, ఇది వరకు ౧౦ మందికి ౧౦ గదులు ఒక ఉమ్మడి వసారా, ఒక ఉమ్మడి వంటశాల ఉండేది ఇప్పుడు ౧౦ మందికి ౩౦ గదులు ౫ వసారాలు మరియు ౫ వంటశాలలు, అనవసరమైన ఖర్చులు.
విడిపోయాకా పెరిగిన ఖర్చులు, ఎవరికీ ధాన్యం ఇంట్లో నిలవ చేసుకోవడం ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే ఇంటి అందం చెడిపోతుంది అని, ఇక ఇదే అదునుగా ఆ బాధను మాకు అనువుగా మార్చుకున్నాము.
భారతీయుడు: అది ఎలాగా?
స్వామి:processed food, ఉమ్మడిగా ఉన్నప్పుడు వాళ్ళలో కొందరి దగ్గర డబ్బులు అప్పుడప్పుడు ఎక్కువగా ఉండేవి ఇంకొందరి దగ్గర తక్కువ ఉండేవి, ఎక్కువ ఉన్న వాళ్ళు బియ్యం మరియు పప్పుదినుసులు కొని నిల్వ ఉంచేవారు, ఎలాగు విడగోట్టాము కాబట్టి పప్పుదినుసులు నిల్వ అవకాశాలు పోయాయి, ఇక ప్రజలలో విదిపోయకా ఈరోజు కావాల్సిన సరుకులు ఈరోజే కొనడం అలవాటయ్యింది, వాళ్ళు నిల్వ చెయ్యకపోతే వేరే వాళ్ళు నిల్వ చెయ్యాలి కదా, ఇక్కడ నష్టపోయింది రైతు, వినియోగ దారుడు - మీరంతా అనుకుంటున్నారు చిల్లర వ్యాపారి లాభ పడ్డాడు అని, ఎక్కువ నష్టపోయినది వాడే.
భారతీయుడు:మరి ఎవరు లాభ పడ్డారు?
స్వామి:అదే FDI లకు ఊతం ఇచ్చింది. రైతుల నష్టాలు గురించి రేపు వివరిస్తాను సాయం సంధ్యావందనంకు సమయం ఆసన్నం అయ్యినది.
అగమ్యి:స్వామి నేను ఈ ఆశ్రమంలో చేరతాను, మీరు చెబుతున్న దాని బట్టి చూస్తే మీరు ఈ ఆశ్రమం మంచి చెయ్యడానికి కట్టించారు అని అనిపిస్తుంది.
స్వామి:నేను ఇక్కడకు వచ్చినది తస్మాదపరిహార్యేర్ధే, ఈ ఆశ్రమం పెద్ద రామానుజుల వారు, వారు ఒప్పుకుంటేనే నీకు ఇక్కడ ఉండే ఆస్కారం లభిస్తుంది.
(సశేషం...)