అగమ్యి గమ్యం లభించింది

పురాతన జీవన విధానం ఎన్నుకుంటే తప్పే (గమ్యం ఏమిటి? ఏ దారి ఎన్నుకోవాలి?) భారతీయుడు:ఎవరు నువ్వు? అసలు అన్ని patents నీ పేరు మీద ఎందుకు ఉన్న...
కలిసి ఉంటే కలదు సుఖం - నలుపు తెలుపుల జీవితం (తస్మాదపరిహార్యేర్ధే - నాలుగవ భాగం)
స్వామి:నేను ఇక్కడకు వచ్చినది తస్మాదపరిహార్యేర్ధే, ఈ ఆశ్రమం పెద్ద రామానుజుల వారు, వారు ఒప్పుకుంటేనే నీకు ఇక్కడ ఉండే ఆస్కారం లభిస్తుంది.

అగమ్యి: మీరు ఇక్కడ పెద్ద దిక్కు కదా, కానే కాదు, నేను నీలాగే ఇక్కడకు వచ్చిన వాడిని.

సాయం సంధ్య పూజ పూర్తయ్యాకా మధ్యవర్తి రామానుజుల వారి దగ్గరకు తీసుకు వెళ్ళారు.

రామానుజులు:ఏమిటి నాయనా ఎవరు ఇతను.
అగమ్యి:నేను గమ్యం వెతుకుతున్నాను.
రామానుజులు: నీ గురించే విశ్వనాధులు ఎదురు చూస్తున్నది.
అగమ్యి:ఎందుకు?
రామానుజులు:నీకు నేను కొన్ని విషయాలు చెబుతాను, ౫ సంవత్సరాల క్రితం విశ్వనాధు ఇక్కడకు వచ్చారు, అతని చెయ్య చూడగానే అతను చేసిన మోసాలు నాకు సాక్షాత్కరించాయి, అతను వస్తాడు అని తెలుసు.
అగమ్యి:మీకు ముందే తెలుసా ఎలా?
రామానుజులు:౧౫ వత్సరముల మునుపు ఒక జంట ఒక జాతకం చూపించింది, ఆ జాతకం ప్రకారం అతను అభివృద్ది చేస్తున్నాను అని చెప్పి భోగాలకు బానిస అవుతాడు, తరువాత తల్లిదండ్రులను కేవలం అవసరానికి మాత్రమే అక్కున చేర్చుకుంటాడు. అతనికి డబ్బే పరమావధి, ఎవరు ఎలా అయినా అవసరం లేదు.
అగమ్యి : అంటే డబ్బు లేకుండా జీవించగలమా?
రామానుజులు: డబ్బు కేవలం మనిషి తయారు చేసుకున్న ఒక తూకం, ఒక తులం బంగారం తయారు చెయ్యడానికి అయ్యే శ్రమ ఇరవై బస్తాల బియ్యం పండించడానికి అవుతుంది అని, కానీ ఆ జాతక చక్రం వాళ్ళు చేసిన పని వల్ల శ్రమకు విలువ లేకుండా పోయింది. వారి జీవితంలో మనిషి కన్నా వస్తువే ముఖ్యం.
అగమ్యి : వస్తువే ఎలా ముఖ్యం అయ్యింది?
రామానుజులు : అది అతనే వివరిస్తాడు, ఇక ఇలా తల్లిదండ్రులను తన అవసరం కోసం చూడడం, ప్రజలను వస్తువులుగా చూడడం మొదలు పెట్టి పాపాలు పెంచుకుంటూ పోయాడు.
అగమ్యి : మరి పాప పరిహారం.
రామానుజులు: తప్పుకు కొన్ని శిక్షలు ఉంటాయి, అవి తప్పు వల్ల బాధ పడిన వారు క్షమించడం.
అగమ్యి : అంటే
రామానుజులు : ఈ శిక్ష భయంకరమైంది, ప్రపంచం మొత్తానికి తెలుసు తప్పు నువ్వు చేసావు అని, కానీ బాధ పడిన వ్యక్తీ క్షమిస్తే మనసు పడే వేదన, ఈ శిక్ష పరిహారంతో తీర్చుకోలేరు. ఇక తరువాత స్వీయ శిక్ష, ఇందులో నీకు నువ్వుగా పాప పరిహారం చేసుకోవడం, ప్రస్తుతం విశ్వనాధులు ఆ శిక్షలో ఉన్నారు. ఇంకొక శిక్ష అతని తప్పును మన్నించి అతనిని అక్కున చేర్చుకోవడం దీని గురించి విశ్వనాధులు రోజూ తల్లిదండ్రులను వేడుకుంటున్నాడు.
అది అతని కర్మ, దాని గురించి వారి తల్లిదండ్రులే చెప్పగలరు.
అగమ్యి : వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు?
రామానుజులు:  వారి శరీరం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.
అగమ్యి :  అంటే?
రామానుజులు: రేపు నీకే పరిచయం చేస్తాను.
(సశేషం..)