అగమ్యి గమ్యం లభించింది(రెండవ భాగం)

భారతీయుడు:మరి గొడవపడుతూ కలిసి ఉండాలి అంటారా?
కలిసి ఉంటే కలదు సుఖం - విడిపోతే Super Markets (తస్మాదపరిహార్యేర్ధే - ఆరవ భాగం)
స్వామి మళ్ళీ తాన పాప పరిహారం వైపు పయనించాడు, అగమ్యి రామానుజుల దగ్గరకు.

అగమ్యి: ఇక్కడకు వచ్చిన వారందరూ పరిహారం తీర్చుకోవడానికేనా?
రామానుజులు:కాదు, కొందరు మాత్రమే, ఇంకొందరు ఈ జీవన విధానం వల్ల సుఖంగా నివసించగలం అని, ఇంకొందరు సమాజ సేవ చెయ్యడానికి, ఇంకొందరు ఇంకొకరి గమ్యానికి వారధిగా ఏర్పడటానికి వచ్చారు.
అగంయి:వారధి అంటే?
రామానుజులు:నీ గురించే తీసుకుందాం, నీకు సాయం చెయ్యాలి అని ఉంటుంది, సాయం పొందటం ఇష్టం లేదు, నీ లాంటి వాళ్ళను ఆ దేవుడు ఇక్కడకు పంపినది విడిపోయిన వ్యక్తులను కలపడానికి.
అగమ్యి:నిజమా? నేను చెయ్యను గాక చెయ్యను మీరు అన్నారు కాబట్టి.
రామానుజులు:నీ నైజం నువ్వు మార్చుకోవు కోలేవు.
అగమ్యి:చూద్దాం.
రామానుజులు:నీ గమ్యం అదే ఎవరినైనా కలపడం. సరే నువ్వు అడిగావు కదా విశ్వనాధు ఏమి చేస్తున్నారు అని? నీకు గతంలో చెప్పాను కదా విశ్వనాధు తల్లిదండ్రులు నాకు జాతకం చూపించారు అని, ఆ జాతక చక్రం ప్రకారం అతను పట్టిందల్లా బంగారం అని అందరూ చెప్పారు కానీ ఆ బంగారం ఇంకొకరిని నాశనం చెయ్యగా వచ్చింది అని. ఇప్పుడు ఆ జాతకం చెప్పిన వారు తప్పు చేసినట్టు అని నీకు అనిపించ వచ్చు , వాళ్ళు వాళ్ళ పరిమితులలో చెప్పారు. ఈ రోజు అతని తల్లిదండ్రుల దగ్గరకు వెళదాం.
ఈ సంభాషణ తరువాత రామానుజుల వారు యోగనిద్రలో మునిగిపోయారు, అగమ్యి తిరిగి సభాప్రాంగణం కు చేరుకున్నాడు, సభాప్రాంగణం అంటే చుట్టూ చెట్లు మధ్యలో ఒక రావి చెట్టు కింద అరుగు. ఇప్పుడు హరికధ చెబుతున్నాడు హరిదాసు.
(సశేషం...)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.