మన దేశాన్ని మనం ఎలా కాపాడుకో గలము?

మొదటిది మనం చేనేత వస్త్రాలు ధరిద్దాం.
చేనేత వస్త్రాల వాళ్ళ దగ్గర సుమారు ౩౦౦ నుంచీ మొదలవుతాయి, ఒక వేళ మీకు మంచి వస్త్రాలు ఎన్నుకోవడం రాకపోతే మీరు అమలాపురం/కాకినాడ(మా దగ్గరలోని ప్రదేశాలు కాబట్టి చెప్పాను) లోని వస్త్ర దుకాణాలకు వెళ్ళి కొనుక్కోవచ్చు కాకపొతే దుకాణం ధరలు హెచ్చుగా ౫౦౦ నుంచీ మొదలవుతాయి.
చాలా రకాలు దొరుకుతాయి.
ఇక నాణ్యత ప్రమాణాల గురించి చర్చించుకోవాలి అంటే రెండు రకాలు
ఒకటి సన్న పోగు ఇంకొకటి లావు పోగు.
వాటి ధరలు నేటి చిన్న దుస్తులకు పెద్ద దుస్తులకు వ్యతిరేకంగా ఉంటాయి ఎందుకంటే వాటి ధరలో వస్తువు ధర మరియు పనితనం నిక్షిప్తం అయి ఉంటాయి కానీ మీ విశృంఖల తత్వానికి లేదా అక్కడ పెట్టిన AC ధర కలిపి ఎక్కువ అవ్వదు.

ఇక రెండవది :
పసుపు వాడదాం నలుగు పెట్టుకుందాం, సబ్బు మానెయ్యడం కొంచం కష్టమే కానీ రంగు సబ్బులు రంగు వస్తువులు మానేద్దాం. వాటి వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతూ ఉంది.

మూడవది:
నడక లేదా Cycle కి ప్రాధాన్యం ఇద్దాం ఎందుకంటే మనం అనవసరంగా Gym కు వెళ్ళాల్సిన అవసరం రాదు కదా.

ఇలా ఇంకొన్ని ఉంటాయి.