ఇది నా స్వానుభవం

కొన్ని రోజుల క్రితం మాకు సెలవులు వచ్చాయి, అప్పుడు నేను ఇంటికి వెళ్ళాను.

అమ్మ చీర కొంటాను అంటే మేము మా దగ్గరలోని చేనేత వస్త్ర దుకాణానికి వెళ్ళాము.

అక్కడ ౨౦ శాతం ౩౦ శాతం ౪౦ శాతం తగ్గింపు అని పెట్టారు, సాధారణంగా చేనేత దుకాణంలో ౨౦ శాతం ఎలాగూ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం కల్పిస్తున్న వ్రాయితీ. మరి ముప్పై నలభై ఏమిటి అని అడిగితె ౩ సంవత్సరాల క్రితం వచ్చి నిల్వ ఉండి పోయిన సరుకు అన్నాడు అక్కడ అమ్మే వారు.
ఎందుకు ఉండిపోయాయి అని అడిగితే, బట్టలు కుట్టించుకునే వాళ్ళు లేరు అని, పోనీ ఇప్పుడైనా అమ్ముడవుతున్నాయా అంటే పెట్టిన వారం రోజులూ అమ్ముడయ్యాయి తరువాత మంచివి లేక కొనడానికి ఎవరూ రావట్లేదు అన్నాడు.
కానీ కారణాలు అవి కావు, ఆధునీకరణ అనే అబద్దాల మేడలో మనం ఉన్నాం కాబట్టి.
ఈ అబద్దాల మేడలో మొదటి అబద్దం సమయం లేదు - కార్యాలయం దగ్గర ఇళ్ళు అద్దెకు తీసుకుంటే కార్యాలయానికి తొందరగా రావాలి అనే భయంతో దూరంగా తీసుకుని రోజూ అనవసరపు ప్రయాణాలు, సరే శెలవులు లేవా అంటే ఉన్నాయి కానీ అవి వస్తే చాలు Goa Ooty లేదా పర్వతారోహణ కు నిష్క్రమించడం, అదీ కాకపొతే తాగి తందనాలు ఆడటం.
ఇక రెండవ అబద్దం ధరలు ఎక్కువ - మనకి మొదటి నుంచీ అలవాటే కదా నా పనికి తగినంత చెల్లించు కానీ నేను నా ఇష్టం వచ్చినట్టు చెల్లిస్తాను అనడం. సర్లే ఇది కారణం కాదు అసలు కారణం అమ్మాయిలే కాదు అబ్బాయిలుకూ ఈ రోజు కట్టిన బట్టలు పక్షం రోజుల వరకు తిరిగి కట్ట కూడదు అని అనుకుంటున్నారు కాబట్టి.
ఇక మూడ అబద్దం - నాణ్యత లేదు, అంటే ౨౦ మంది కలిపి లాగినా చిరగ కూడదు అని దాని అర్ధం. నాణ్యత అంటే కనిపించేది కాదు అని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము, ఎక్కువ మార్లు ఉతికినా పాడవ్వనిది అసలు నాణ్యత యొక్క అర్ధం.
ఇలా నాల్గవ అబద్దం - Brand value లేదు, అసలు భారతదేశం అనేదే పెద్ద Brand value అని తెలుసుకొని స్థితిలో ఉన్నాము.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.