అభివృద్ది గురించి తెలుసుకోండి - భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే!

భారతీయుడు:మీరు అసమానతలు తయారు చేసారు, కాబట్టి శిక్ష అనుభవిస్తున్నారు.

తప్పు చేసిన వాడిని కొట్టరు-ఎందుకంటే వాడిని కొడితే డబ్బులు రాలవు.

మీలో సమానత్వం కోరుకునే వాళ్ళలో కొంతమంది పెద్ద వాళ్ళని హేళన చేస్తే వాళ్ళ
మిగిలిన స్నేహితులు కూడా చెయ్యాలి అని కోరుకునే వారు, పెద్ద వాళ్ళని खडूस
అని సంబోధించిన Advertisement సంస్థను ఇంకా వాడుతున్నారు.



వ్యాపారి:ఇక మీలో కొంతమంది పాత కాలంలో మనుషుల లా ఉండటం వలెనే అభివృద్ది కుంటుపడుతుంది అని తెగ బాధ పడిపోతున్నారు. నియమాలను మనకు అనుగుణంగా మార్చుకుని ధనవంతులు కావడం అప్పుడే కాదు ఎప్పుడూ ఉంది. కానీ నియమాలు అర్ధం చేసుకుని బ్రతికితే అందరం సుఖంగా ఉంటాం, కానీ సుఖంగా ఉండటం అభివృద్ది కాదు అనే స్థితికి చేరుకున్నాము.



భారతీయుడు:అంటే ఊరంతా కలిసి ఒక ప్రదేశంలో మల విసర్జన చేయడమా?



వ్యాపారి:సూత్రం నిరూపితం అయినా ఎందుకు అయినదో వ్రాయలేదు లేదా లేదు కాబట్టి నిందించడం అలవాటే కదా. ఎంతమంది ఒప్పుకుంటారు మన ఆయుర్వేద శాస్త్రాన్ని?

చాలా మంది ఒప్పుకోరు ఎందుకంటే ఒక్కోమారు రోగికి పాదరసం ఇస్తున్నారు అని. నిజానికి భూమి మీద ఉన్న ఏ వస్తువు తీసుకున్నా అది నీ జీవనానికి ఉపయోగ పడేదే, కాకపొతే నువ్వు గానీ నీ శరీరం గాని దాన్ని ఉపయోగించుకునే తీరు బట్టి ఉంటుంది, అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు అర్ధం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు మన కర్మ సిద్దాంతం - నువ్వు చేసుకున్న కర్మకు నువ్వే బాధ్యుడవు, కానీ అది అంతగా ఆదరణ పొందలేదు కానీ అదే సిద్దాంతం మనిషికి కాక ఒక వస్తువుకు ఇచ్చి Newtons Third law of motion "every action has equal and opposite reaction" ను తయారుచేసి అభివృద్ది పథంలో మొదటి అడుగు వేసాము అనుకున్నాము.
భారతీయుడు:ఏమిటి నువ్వు మాట్లాడేది - అంటే Newton కర్మ సిద్ధాంతాన్ని తర్జమా చేసాడా?
వ్యాపారి:నేను అన్నన్నా?
భారతీయుడు:నీ వ్యాఖ్యలకు అర్ధం అదే కదా!
వ్యాపారి:అది అభివృద్ధిలో రెండవ భాగం నీకు నువ్వు విశ్లేషించే శక్తి కోల్పోతావు.
భారతీయుడు:నేను కోల్పోలేదు నువ్వు ఇప్పుడు చెప్పిన దాన్ని వ్యతిరేకించాను కదా, అంటే విశ్లేషణ కోల్పోయినట్టా?
వ్యాపారి:మూడవ అభివృద్ది - ఆ సిద్దాంతం ఈ సిద్ధాంతం ఒకటి కాదు అని ఒప్పుకోక పోవడం. సరే ఇంతకీ అభివృద్ది గురించి తెలుసుకుందాం. గతంలో స్వామీజీ తెలిపారు FDI లు వస్తే ప్రజలు అభివృద్ది చెందుతారు అని నమ్మించాము అని, అదే నిజం అని కొంతమంది నమ్మారు, ఇంకొంతమంది అంటే నాలాంటివాళ్ళకి తొక్కేసే ప్రక్రియ అని అర్ధం అయ్యింది దేశంలో ఉన్న ఒకే ఒక్క మతతత్వ party దాని నిజ స్వరూపం బయటపెట్టింది.అది, బ్రతకగలం అని నమ్మకం ఉంటె ప్రజలు గళం ఎత్తుతారు తప్పు చేసిన వాడి మీద! లేక పొతే నోరు మూసుకుని కూర్చుంటారు. కాబట్టే ప్రజలకు స్వశక్తి మీద బ్రతికే అవకాశం లేకుండా చెయ్యడం మాత్రమె congress తిరిగి అధికారంలోకి రావడానికి పన్నిన పన్నాగం పని అని చెప్ప గలిగింది. మిగిలినవి కేవలం లాభాపేక్షతో నోరు మూసుకుని కూర్చున్నాయి.
ఇక అభివృద్ది అంటే మూడొంతుల పంటలో ఒక వంతు వృధా చెయ్యడం, నీలో రోగ నిరోధక శక్తి నశింపజేయడం.
భారతీయడు:అదెలాగ?
స్వామి:అది ముందే వ్యాపారి చెప్పారు కదా నీలో ఆలోచనా శక్తి తగ్గిస్తే ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి నశిస్తుంది.
భారతీయుడు:అర్ధం కాలేదు.
స్వామి:తరువాత చెప్పుకుందాం!
భారతీయుడు:నాకేమైనా పనిలేదు అనుకున్నావా ఎదో ఈ మూడు రోజులు సెలవులు కాబట్టి ఆహ్లాదం కోసం వచ్చాం, రేపు మా తిరుగు ప్రయాణం నువ్వు ఇప్పుడే చెప్పాలి.
స్వామి:అదే నాయనా ఆలోచనా శక్తి నశించడం అంటే.
(సశేషం...)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.